Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1fa9dff0-1443-4afa-9dc2-90365c88dce1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1fa9dff0-1443-4afa-9dc2-90365c88dce1-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబుతో తన 16వ సినిమాని చేస్తున్నారు. నేడు ఈ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేసారు. ఈ పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణి కపూర్, దర్శకులు శంకర్, సుకుమార్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.వీటితో పాటు ఈ మూవీకి సంబంధించిన మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తునsocialstars lifestyle{#}Janhvi Kapoor;jahnavi;Jr NTR;sukumar;Tollywood;Upasana;Winner;Nijam;GEUM;Event;Ram Charan Teja;News;Director;Chiranjeevi;Pooja Hegde;Cinema;India;bollywoodచరణ్ మూవీ నుంచి తప్పుకుంటున్న జాన్వీ కపూర్...???చరణ్ మూవీ నుంచి తప్పుకుంటున్న జాన్వీ కపూర్...???socialstars lifestyle{#}Janhvi Kapoor;jahnavi;Jr NTR;sukumar;Tollywood;Upasana;Winner;Nijam;GEUM;Event;Ram Charan Teja;News;Director;Chiranjeevi;Pooja Hegde;Cinema;India;bollywoodThu, 21 Mar 2024 12:15:00 GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబుతో తన 16వ సినిమాని చేస్తున్నారు. నేడు ఈ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేసారు. ఈ పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణి కపూర్, దర్శకులు శంకర్, సుకుమార్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.వీటితో పాటు ఈ మూవీకి సంబంధించిన మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఆరెంజ్, ఎవడు వంటి సినిమాలు చేసిన చరణ్ కి పెద్దగా గుర్తింపు దక్కలేదు.కానీ అనంతరం రంగస్థలంతో ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఆ తరువాత త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం చరణ్ కి ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి ఉండదని చెప్పొచ్చు. ఇటీవలే ఉపాసన మరియు చరణ్ దంపతులకి ఒక ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే.ఇక వీరికి క్లీన్ కారా జన్మించిన నాటి నుంచి నేటి వరకు వీరి కుటుంబంలో ఏదో ఒక శుభవార్త వినిపిస్తూనే ఉంది. క్లీన్ కారా జన్మించిన అనంతరం చిరంజీవికి పద్మ భూషణ్ దక్కడం వంటివి జరగడంతో క్లీన్ కారా జాతకం మంచిదని ప్రతి ఒక్కరూ ఓ ముద్ర వేసుకున్నారు. ఇక ప్రస్తుతం చెర్రీ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కూడా సూపర్ హిట్ అయితే ఇది కూడా క్లీన్ కారా ఖాతాలో వేస్తారని చెప్పొచ్చు. ఈ మూవీ అనంతరం బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు చెర్రీ.ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఆడిషన్స్ ప్రారంభించారు. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయిన బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న రెండవ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ హైప్స్ నెలకున్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ ని హీరోయిన్గా తీసుకున్నట్లు ఇప్పటికే అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి జాన్వి తప్పుకున్నట్లు తెలుస్తుంది.శ్రీదేవి వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో స్థిరపడింది. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది. అదేవిధంగా చరణ్ సినిమాలో కూడా అవకాశం కొట్టేసింది అంటూ ఇటీవల కాలంలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జాన్వికి సరైన డేట్స్ కుదరకపోవడంతో చరణ్ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>