Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle85924fd3-f857-4457-bee4-e41ab8420167-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle85924fd3-f857-4457-bee4-e41ab8420167-415x250-IndiaHerald.jpgవిశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చివరగా నటించిన 'విక్రమ్' మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది.ఆయన కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ విడుదలైన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది.విక్రమ్ సూపర్ హిట్ తర్వాత కమల్ శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో కలిసి ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబsocialstars lifestyle{#}Mani Ratnam;Salman Khan;jayam ravi;shankar;Gangster;Trisha Krishnan;Blockbuster hit;Hero;Tamil;Darsakudu;Director;Cinema‘థగ్ లైఫ్’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు కమలహాసన్...!!‘థగ్ లైఫ్’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు కమలహాసన్...!!socialstars lifestyle{#}Mani Ratnam;Salman Khan;jayam ravi;shankar;Gangster;Trisha Krishnan;Blockbuster hit;Hero;Tamil;Darsakudu;Director;CinemaThu, 21 Mar 2024 11:42:05 GMTవిశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చివరగా నటించిన 'విక్రమ్' మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది.ఆయన కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ విడుదలైన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది.విక్రమ్ సూపర్ హిట్ తర్వాత కమల్ శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో కలిసి ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘థగ్ లైఫ్’ అనే పేరు పెట్టారు. కమల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. కమల్ కెరీర్ లో 234వ సినిమాగా ‘థగ్ లైఫ్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ లో వెల్లడించారు. “నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదిటిపై క్రిమినల్, గూండా, యాకూజా అని రాసినట్టు ఉన్నారు” అంటూ సాగిన గ్లింప్స్  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కమల్ సరికొత్త వేషధారణలో కనిపించి ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. టైటిల్స్ గ్లింప్స్ తర్వాత ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేనున్నట్లు టాక్ వినిపించింది. రెండు సరికొత్త పాత్రలల్లో కనిపిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ మూవీలో కమల్ పాత్రలకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఆయన మూడు పాత్రలు పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మూడు పాత్రలను లింక్ చేస్తూ మణిరత్నం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. ‘థగ్ లైఫ్’ మూవీలో  త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరియు తమిళ హీరో జయం రవి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>