Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3e7afca1-9ec6-4aae-96d0-4cb8d29ed01d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3e7afca1-9ec6-4aae-96d0-4cb8d29ed01d-415x250-IndiaHerald.jpgసీరియల్ నటి, డైరెక్టర్ సూర్య కిరణ్ సోదరి 'సుజిత ధనుష్' గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సుజిత ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే చైల్డ్ ఆర్టిస్టు స్థాయి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు వరకూ దాదాపు 50 సినిమాల్లో నటించి మెప్పించారు సుజిత. ఇక ఈమె వెండితెర ప్రేక్షకులకంటే..బుల్లితెర ప్రేక్షకులకే బాగా పరిచయమని చెప్పవచ్చు. ఎందుకంటే..సుజిత తెలుగులో పలు సిరియల్స్ లో ప్రధాన పాత్రల్లో అలరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సుజిత తెలుగుతో పాటు తమిళsocialstars lifestyle{#}kiran;sathyam;bus;Manam;Annayya;netizens;Girl;Telugu;Directorసోషల్ మీడియా లో ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసిన సుజిత...!!!సోషల్ మీడియా లో ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసిన సుజిత...!!!socialstars lifestyle{#}kiran;sathyam;bus;Manam;Annayya;netizens;Girl;Telugu;DirectorThu, 21 Mar 2024 13:15:00 GMTసీరియల్ నటి, డైరెక్టర్ సూర్య కిరణ్ సోదరి 'సుజిత ధనుష్' గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సుజిత ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే చైల్డ్ ఆర్టిస్టు స్థాయి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు వరకూ దాదాపు 50 సినిమాల్లో నటించి మెప్పించారు సుజిత. ఇక ఈమె వెండితెర ప్రేక్షకులకంటే..బుల్లితెర ప్రేక్షకులకే బాగా పరిచయమని చెప్పవచ్చు. ఎందుకంటే..సుజిత తెలుగులో పలు సిరియల్స్ లో ప్రధాన పాత్రల్లో అలరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సుజిత తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం వంటి నాలుగు భాషల్లో 40కి పైగా సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే సుజిత తన అన్నయ్య సూర్య కిరణ్ చనిపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు సుజిత మరో ఇంట్రెస్టింగ్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్ గా మారింది.సుజిత ధనుష్.. సత్యం సినిమా డైరెక్టర్ సూర్య కిరణ్ కు సోదరిగానే కాకుండా.. ఓ నటిగా తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె బుల్లితెర మీదే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివిగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలు, అప్‌డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది సుజిత. అయితే సోషల్ మీడియాలో కూడా సుజితకు మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా, ఇటీవలే తన అన్నయ్య చనిపోవడంతో కొన్ని రోజుల క్రితం ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది సుజిత. అయితే ఇంతలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

అందులో సుజిత ఏం చెప్పిదంటే.. ఈ వీడియోలో మీకు ఒక చిన్న స్టోరీ చెబుతా వినండి. 'ఒక బస్సులో పెద్దావిడ కూర్చొని ఉంది. అయితే బస్సు మొత్తం ఫుల్ రెష్‌గా ఉండటంతో.. ఇంతలో ఒక అమ్మాయి భారీ లగేజ్ తీసుకొని ఆ బస్సు ఎక్కింది. ఇక ఆ అమ్మాయి అందరినీ తోసుకుంటూ ఆ పెద్దావిడ పక్కన కాస్త ప్లేస్ ఉండటంతో ర్యాష్‌గా పక్కకి నెట్టి లగేజ్ ఆవిడ మీద పడేసి మరీ కూర్చుంది. కానీ, ఇంత చేసినా ఆ పెద్దావిడ మాత్రం కాస్త సర్దుకొని సైలెంట్‌గా ఉంది. అయితే తన పక్కన కూర్చున్న ఆ అమ్మాయి మాత్రం అయ్యో ఇందాక కాస్త కంగారులో ముసలావిడని పట్టించుకోకుండా కాస్త ర్యాష్‌గా బిహేవ్ చేశాను అని ఫీల్ అవుతుంది. విచిత్రం ఏమిటంటే.. ఆ పెద్దావిడ మాత్రం ఏమీ జరగనట్లే, ఆ అమ్మాయిని ఒక్క మాట కూడా అనకుండా సైలెంట్‌గా కూర్చొని ఉంది. దీంతో ఇదింతా చూసి ఆశ్చర్యపోయిన ఆ అమ్మాయి.. ఏంటి అమ్మా మిమ్మల్ని నేను పక్కకి నెట్టేసి మరీ కూర్చున్నా కదా.. మీకు నా మీద కోపం రాలేదా అని అడుగుతుంది. దానికి ఆ పెద్దావిడ ఒక సమాధానమిస్తుంది. 'మనది చాలా చిన్న ప్రయాణం అమ్మా.. నేను రెండు స్టాపుల తర్వాత దిగిపోతాను.. ఇంతలో నిన్ను రెండు తిట్లు తిట్టడం వల్ల నాకేం వస్తుంది.' అని సింపుల్‌గా చెబుతుంది.వాస్తవానికి ఆ పెద్దావిడ చెప్పింది వనడానికి చాలా చిన్న మాటే కానీ, అందులోచాలా పవర్‌ఫుల్ మెసేజ్ ఉంది. ఎందుకంటే.. మనది చాలా చిన్న ప్రయాణం. అది ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. అయితే ఈ మధ్యలో ఎవరినో మనం బాధపెట్టి , ఎవరో మనల్ని బాధపెడుతున్నారని ఫీల్ అవ్వడం, కోపపడటం అనవసరం. మనది చాలా చిన్న ప్రయాణం.. వీలైనంతగా ఆస్వాదిద్దాం.' అంటూ సుజిత ఈ వీడియోలో చెప్పింది. ఇక వీడియోను చూసిన నెటిజన్స్ ఈ స్టోరి వినడానికి చాలా సింపుల్ గా ఉన్న మంచి మెసేజ్ ఇచ్చారంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి, నటి సుజిత చెప్పిన ఈ స్టోరి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>