MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/ustad-show-manchu-manoj-faces-mic-swap-surprise53a083e5-c786-4734-868e-ac3768569c28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/ustad-show-manchu-manoj-faces-mic-swap-surprise53a083e5-c786-4734-868e-ac3768569c28-415x250-IndiaHerald.jpgకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన మోహన బాబు కుమారుడిగా తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి వాటిలో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంత కాలం పాటు వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ భారీ మmanoj{#}manchu manoj kumar;Elections;marriage;Yevaru;court;king;King;CBN;Industries;Tollywood;Telugu;Cinemaఅలాంటి వ్యక్తులకు మాత్రమే ఓటెయ్యాలి... మంచు మనోజ్..!అలాంటి వ్యక్తులకు మాత్రమే ఓటెయ్యాలి... మంచు మనోజ్..!manoj{#}manchu manoj kumar;Elections;marriage;Yevaru;court;king;King;CBN;Industries;Tollywood;Telugu;CinemaThu, 21 Mar 2024 13:43:05 GMTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన మోహన బాబు కుమారుడిగా తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి వాటిలో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంత కాలం పాటు వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ భారీ మధ్య విభేదాలు రావడంతో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకొని విడిపోయారు.

ఆ తర్వాత మనోజ్ కొంత కాలం పాటు ఒంటరిగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే మనోజ్ మరో పెళ్లిని చేసుకున్నాడు. పెళ్లి తర్వాత మనోజ్ వరుస సినిమాలను కూడా ఓకే చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఓటర్ లకి అవగాహన కల్పించేందుకు గాను మనోజ్ ఓ వీడియోని విడుదల చేశాడు. అందులో భాగంగా మనోజ్ మాట్లాడుతూ ... పది మందిని కలుపుకుపోయే వ్యక్తులకు అలాగే పేదవాళ్లకు సహాయం చేసే వ్యక్తులకు మాత్రమే ఓటు వేయండి. ఏదో ఇప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చారు కదా అని వారికి ఓటు వేయకండి.

డబ్బులు ఇచ్చిన వాళ్లు మళ్లీ డబ్బులు సంపాదించుకోవడం కోసం అట్టదారులు తొక్కుతారు. అందుకోసం మీకు మీ గ్రామానికి ... మీ నియోజక వర్గానికి ఎవరు అయితే మంచి చేస్తారు అని మీరు భావిస్తారో వారికి మాత్రమే ఓటు వేయండి అని మంచు మనోజ్ తెలియజేస్తూ ఓ వీడియోని విడుదల చేశాడు. ఇకపోతే మనోజ్ తాజాగా విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>