PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-pawan-pithapuram4c41da29-bf92-47be-b394-65b3373e7daa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-pawan-pithapuram4c41da29-bf92-47be-b394-65b3373e7daa-415x250-IndiaHerald.jpgవీటిల్లో కొత్తపల్లికి మంత్రి దాడిశెట్టి రాజాను, గొల్లప్రోలు మండలానికి మాజీమంత్రి కురసాల కన్నాబాబు, పిఠాపురంకు ఎలాగూ అభ్యర్ధి వంగా గీత ఉన్నారు. వీళ్ళు కాకుండా పై ఎత్తున రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదికూడా సరిపోదన్నట్లుగా ఈమధ్యనే పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు మరీ ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారట. స్ధానికంగా ఉండే కాపు ప్రముఖులను వైసీపీకి అనుకూలంగా ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతలను ముద్రగడపై పెట్టారని పార్టీవర్గాల సమాచారం. jagan pawan pithapuram{#}Mithoon;Mudragada Padmanabham;Abhimanyu Mithun;Yevaru;Jagan;Reddy;geetha;Pawan Kalyan;local language;Ministerగోదావరి : ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేస్తున్నారా ?గోదావరి : ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేస్తున్నారా ?jagan pawan pithapuram{#}Mithoon;Mudragada Padmanabham;Abhimanyu Mithun;Yevaru;Jagan;Reddy;geetha;Pawan Kalyan;local language;MinisterThu, 21 Mar 2024 03:00:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో  ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేస్తున్నారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పిఠాపురంలో పవన్ను కచ్చితంగా ఓడించాలన్న టార్గెట్ తో జగన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే నలుగురికి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలోని మూడు మండలాలకు ప్రత్యేకంగా అబ్జర్వర్లను నియమించారు. నియోజకవర్గంలో పిఠాపురం, యూ కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలున్నాయి.





వీటిల్లో కొత్తపల్లికి మంత్రి దాడిశెట్టి రాజాను, గొల్లప్రోలు మండలానికి మాజీమంత్రి కురసాల కన్నాబాబు, పిఠాపురంకు ఎలాగూ అభ్యర్ధి వంగా గీత ఉన్నారు. వీళ్ళు కాకుండా పై ఎత్తున రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదికూడా సరిపోదన్నట్లుగా ఈమధ్యనే పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు మరీ ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారట. స్ధానికంగా ఉండే కాపు ప్రముఖులను వైసీపీకి అనుకూలంగా ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతలను ముద్రగడపై పెట్టారని పార్టీవర్గాల సమాచారం.





పార్టీలో చేరిన తర్వాత ఇప్పటికే ముద్రగడ కాపు ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారట. కాపు ప్రముఖులతో తనకున్న పరిచయాలు, సన్నిహితాన్ని ఉపయోగించి పవన్ ఓటమికి ముద్రగడ తనదైన పద్దతిలో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కిర్లంపూడి నుండి పిఠాపురంకు  ముద్రగడ క్యాంపు మార్చబోతున్నట్లు సమాచారం. ఎన్నికలయ్యేవరకు ముద్రగడను పిఠాపురంలోనే ఉంటే బాగుంటుందని జగన్ సూచించారట. అందుకు ముద్రగడ కూడా సానుకూలంగానే స్పందించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. నియోజకవర్గంలో సుమారు 2.3 లక్షలమంది ఓటర్లున్నారు. ఇందులో దాదాపు 70 వేలు కాపులే ఉన్నారు.





అయితే కాపులు మాత్రమే ఓట్లేస్తే పవన్ గెలవరు. కాని పవన్ కాపులను ఎంకరేజ్ చేసేకొద్ది కాపేతర వర్గాలు వ్యతిరేకంగా మారే అవకాశముంది. కాపుల తర్వాత శెట్టిబలిజలు, మత్స్యకారులు, పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారు. కాపుల్లో మెజారిటి పవన్కే ఓట్లసినా మిగిలిన బీసీలు, ఎస్సీలు, కాపేతర వర్గాలు ఓట్లేస్తే వంగా గీత గెలుపు ఖాయమని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. పిఠాపురంలో ఎవరు గెలవాలన్నా లక్ష ఓట్లు దాటాలి. గీతకు లోకల్ గా మంచి సంబంధాలుండటం, పాజిటివ్ ఇమేజి ఉండటం సానుకూలమని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>