Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle58c7efdd-5fc8-4cbc-8424-9b491fe0af01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle58c7efdd-5fc8-4cbc-8424-9b491fe0af01-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే స్టార్ హీరో హీరోయిన్ల నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ఎవరు కూడా వదులుకోరు.కానీ ఓ హీరో మాత్రం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పిలిచి రెండుసార్లు తన సినిమాలో అవకాశం ఇస్తే రిజెక్ట్ చేశారట.మరి ఇంతకీ ఆ హీరో ఎవరు..ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.చిరంజీవి సినిమాలో ఒకప్పుడు రవితేజ , శివాజీ, శ్రీకాంత్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, కిచ్చా సుదీప్ వంటి వాళ్లు నటించేవారు.ఇక రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా రవితేజ చిరంజీవితో అవకాశం వsocialstars lifestyle{#}Sudeep;surender reddy;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Naini Narshimha Reddy;Athadu;Mohanlal;Blockbuster hit;ravi teja;Ravi;Chiranjeevi;Yevaru;Chitram;Director;Kannada;Hero;Cinema;Teluguమెగాస్టార్ చిరంజీవి ఆఫర్లను రెండు సార్లు రిజెక్ట్ చేసిన సలార్ మూవీ విలన్...!!!మెగాస్టార్ చిరంజీవి ఆఫర్లను రెండు సార్లు రిజెక్ట్ చేసిన సలార్ మూవీ విలన్...!!!socialstars lifestyle{#}Sudeep;surender reddy;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Naini Narshimha Reddy;Athadu;Mohanlal;Blockbuster hit;ravi teja;Ravi;Chiranjeevi;Yevaru;Chitram;Director;Kannada;Hero;Cinema;TeluguThu, 21 Mar 2024 14:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే స్టార్ హీరో హీరోయిన్ల నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ఎవరు కూడా వదులుకోరు.కానీ ఓ హీరో మాత్రం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పిలిచి రెండుసార్లు తన సినిమాలో అవకాశం ఇస్తే రిజెక్ట్ చేశారట.మరి ఇంతకీ ఆ హీరో ఎవరు..ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.చిరంజీవి సినిమాలో ఒకప్పుడు రవితేజ , శివాజీ, శ్రీకాంత్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, కిచ్చా సుదీప్ వంటి వాళ్లు నటించేవారు.ఇక రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా రవితేజ చిరంజీవితో అవకాశం వస్తే వదులుకోకుండా నటించారు. అయితే ఓ హీరో మాత్రం చిరంజీవి ఆఫర్ ని రెండుసార్లు రిజెక్ట్ చేశారట.ఇక ఆయన ఎవరో కాదు రీసెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సలార్ మూవీ విలన్ పృథ్వీరాజ్. సుకుమారన్పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగు, తమిళం, మలయాళంలో మూవీలు చేస్తున్నాడు. ఇటీవలే డైరెక్టర్ ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్ లో కీలక పాత్ర పోషించాడు. అయితే తాజాగా ఇతడి గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి రెండు సార్లు స్వయంగా ఇచ్చిన ఆఫర్లను తిరస్కరించాడట పృథ్వీరాజ్. దీంతో అతడికేమైనా పిచ్చి పట్టిందా? చిరు అడిగితే కాదనడం ఏంటి? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అతడు ఆ ఆఫర్లను రిజెక్ట్ చేయడానికి కారణాలు ఉన్నాయట. ఆ వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు నటీ, నటులు ఎదురుచూస్తూ ఉంటారు. చిరు పక్కన చిన్న పాత్ర వచ్చినా చాలాని భావిస్తుంటారు. అలాంటి పిలిచి మరీ పాత్ర ఇస్తాను చేయమంటే సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేయలేదట. ఒకటి కాదు, రెండు సార్లు మెగాస్టార్ ఇచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. దానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. కొన్ని విషయాలు తెలిశాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి సైరా నరసింహా రెడ్డి అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీలో కన్నడ హీరో కిచ్చ సుదీప్ పోషించిన పాత్రకు మెుదట పృథ్వీరాజ్ నే అనుకున్నారని, అదీకాక ఆ పాత్రకు అతడి పేరును స్వయంగా మెగాస్టారే సజెస్ చేశారట.కానీ అప్పటికే ఆడుజీవితం అనే మూవీ కోసం భారీగా బరువు తగ్గాడు పృథ్వీరాజ్. దీంతో ఆ ఛాన్స్ ను వదులుకోవాల్సి వచ్చింది. దీని తర్వాత వెంటనే మరో లక్కీ ఛాన్స్ అతడి తలుపు తట్టింది. సైరా మూవీ ప్రమోషన్స్ కోసం చిరు కేరళ వెళ్లగా.. ఆ సమయంలో మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' మూవీ విడుదలైంది. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగు హక్కులను మెగాస్టార్ కొనుగోలు చేశారు. తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించాల్సిందిగా మరోసారి అతడి కోరాడు. కానీ ఆడుజీవితం మూవీ షూటింగ్ లో బిజీ ఉండటం కారణంగా ఈ ఆఫర్ ను సైతం రిజెక్ట్ చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సలార్ నటుడు. మరి అనివార్య కారణాల వల్ల మెగాస్టార్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న అతడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>