Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viralb5293224-555f-40cc-872a-46877116e79b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viralb5293224-555f-40cc-872a-46877116e79b-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. అప్పటివరకు క్రేజీ హీరో అంటూ పేరు సంపాదించుకుని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వారు.. రెండు మూడు ఫ్లాపులతోనే అవకాశాలు అందుకోలేక ఇండస్ట్రీలో కనుమరుగవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది అప్పటివరకు ఫ్లాప్ హీరోగా పేరు తెచ్చుకుని.. ఇక ఒక్క హిట్టుతో స్టార్ హీరోగా మారిపోవడం కూడా చూస్తూ ఉంటారూ. ఇలా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత కనుమరుకైన హీరోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలViral{#}tammareddy bharadwaja;Industry;Beautiful;Hero;shankar;Cinemaవైరల్ : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన.. ఒకప్పటి క్రేజీ హీరో?వైరల్ : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన.. ఒకప్పటి క్రేజీ హీరో?Viral{#}tammareddy bharadwaja;Industry;Beautiful;Hero;shankar;CinemaWed, 20 Mar 2024 14:15:00 GMTసినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. అప్పటివరకు క్రేజీ హీరో అంటూ పేరు సంపాదించుకుని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వారు.. రెండు మూడు ఫ్లాపులతోనే అవకాశాలు అందుకోలేక ఇండస్ట్రీలో కనుమరుగవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది అప్పటివరకు ఫ్లాప్ హీరోగా పేరు తెచ్చుకుని.. ఇక ఒక్క హిట్టుతో స్టార్ హీరోగా మారిపోవడం కూడా చూస్తూ ఉంటారూ.


 ఇలా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత కనుమరుకైన హీరోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా చాలాకాలం తర్వాత ఆయా సెలబ్రెటీలను చూసి ఆశ్చర్య పోవడం ప్రేక్షకుల వంతు అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ క్రేజీ హీరో వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ హీరో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. కాసేపు అలా చూస్తూ ఉంటే తప్ప అక్కడ ఉన్నది మనందరికీ తెలిసిన హీరో అన్నది గుర్తుపట్టడం కష్టంగా మారిపోయింది. అంతలా ఆ హీరో లుక్స్ లో మార్పులు వచ్చాయి అని చెప్పాలి.



 ఇంతకీ అతను ఎవరో కాదు.. రోహిత్. 90s కిడ్స్ కి ఈయన బాగా తెలుసు. అప్పట్లో యూత్ ఫుల్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. తమ్మారెడ్డి భరద్వాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రోహిత్.. తర్వాత హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 2001లో వచ్చిన సిక్స్ టీన్ అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అతనికి యూత్లో మంచి క్రేజ్ వచ్చింది. చాలా సినిమాలో హీరోగా నటించిన రోహిత్ తర్వాత సెకండ్ హీరోగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నవవసంతం, శంకర్ దాదా, ఎంబిబిఎస్ శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. అయితే తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు అని చెప్పాలి. ఇప్పుడు రాపిడ్ యాక్షన్ మెషిన్ అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా ఇటీవల అతని లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గుర్తుపట్టలేనంతగా నెరిసిన గడ్డంతో కనిపిస్తున్నాడు రోహిత్.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>