Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardikfd2875aa-26ef-4a96-98cd-eb60268288a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardikfd2875aa-26ef-4a96-98cd-eb60268288a2-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్.. గత కొన్ని సీజన్స్ నుంచి వైభవాన్ని కోల్పోయింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను.. పక్కనపెట్టి కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించింది జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్ తో 2024 ఐపీఎల్ సీజన్లో బరిలోకి దిగి పూర్వవైభవాన్ని సాధించేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంది అని చెప్పాలి. అHardik{#}Hardik Pandya;BCCI;Champion;Instagram;Uppal;surya sivakumar;Mumbai;Cricket;Hyderabad;Heart;March;Gujarat - Gandhinagarప్చ్.. ఇలా జరిగిందేంటి.. హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్?ప్చ్.. ఇలా జరిగిందేంటి.. హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్?Hardik{#}Hardik Pandya;BCCI;Champion;Instagram;Uppal;surya sivakumar;Mumbai;Cricket;Hyderabad;Heart;March;Gujarat - GandhinagarWed, 20 Mar 2024 09:00:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్.. గత కొన్ని సీజన్స్ నుంచి వైభవాన్ని కోల్పోయింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను.. పక్కనపెట్టి కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించింది జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్ తో 2024 ఐపీఎల్ సీజన్లో బరిలోకి దిగి పూర్వవైభవాన్ని సాధించేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంది అని చెప్పాలి.


 అటు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం జట్టులో ఉన్న ఆటగాళ్లను ఎంతో బాగా వినియోగించుకుంటూ ఇక ముంబై ఇండియన్స్ కు పూర్వ వైభవం తీసుకురావాలని అనుకుంటూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో అటు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ఇక ఇంకా ఫిట్నెస్ క్లియర్ చేయకపోవడం గమనార్హం. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న తర్వాత ఇటీవల బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో చేరాడు సూర్య కుమార్ యాదవ్. కాగా ఇటీవల నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్ లో అతను ఫెయిల్ అయ్యాడు.


 ఈ క్రమంలోనే బిసిసిఐ సూర్యకుమార్ యాదవ్ కు ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చేయలేదు. కాగా ఐపీఎల్ లో పాల్గొనాలి అనే ఆటగాళ్లు తప్పనిసరిగా ఈ ఫిట్నెస్ క్లియరెన్స్ చేయాల్సిందే. అయితే టి20 స్పెషలిస్ట్ అయిన సూర్య కుమార్ యాదవ్ కు ఇక ఫిట్నెస్ క్లియరెన్స్ రాకపోవడంతో అటు హార్దిక్ పాండ్యాకు షాప్ తగిలింది. ఎందుకంటే జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించేందుకు సిద్ధమవుతుండగా ఇక సూర్య లాంటి ఆటగాడు దూరం అవడం పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. దీంతో కెప్టెన్ వ్యూహాల మొత్తం తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. కాగా ఈనెల 24వ తేదీన గుజరాత్ టైటాన్స్ తో జరగబోయే తొలి మ్యాచ్ కి సూర్య దూరమయ్యాడు. అయితే ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ కాకపోవడంతో సూర్యా ఇంస్టాగ్రామ్ లో హార్ట్ బ్రేక్ ఇమేజ్ ని షేర్ చేశాడు. కాగా సూర్య మళ్ళీ 21వ తేదీన ఫిట్నెస్ టెస్ట్ లో పాల్గొనబోతున్నాడట. ఆ ఈ టెస్ట్ లో గనుక సూర్య నెగ్గితే మార్చి 27న ఉప్పల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిపోయి మ్యాచ్ లో ఇక జట్టుతో చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా మిస్ అయితే ఫస్ట్ షెడ్యూల్ మ్యాచులకు సూర్య అందుబాటులో ఉండడు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>