Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhasd5af8017-8dd6-4a3a-a063-e7993ea7d9ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhasd5af8017-8dd6-4a3a-a063-e7993ea7d9ce-415x250-IndiaHerald.jpgఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు కేవలం స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే కనిపించేవారు. ఇక ఎవరైనా మిడ్ రేంజ్ హీరో సినిమాలో నటిస్తే తమ కెరియర్ దెబ్బతింటుందని కాస్త భయపడేవారు హీరోయిన్లు. కానీ ఇటీవల కాలంలో కథ నచ్చింది అంటే ఆ సినిమాలో నటించబోయేది స్టార్ హీరోనా చిన్న హీరోనా అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. కథను నమ్ముకుంటూ సినిమాలో నటిస్తూ సూపర్ హిట్లు కొడుతున్నారు అని చెప్పాలి. మొన్నటికి మొన్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అSuhas{#}CBN;anil music;keerthi suresh;mahesh babu;suhas;Blockbuster hit;salt;Anushka;Mister;Heroine;Tollywood;News;Hero;Cinemaఅయ్యబాబోయ్.. సుహాస్ సరసన మహేష్ బాబు హీరోయిన్?అయ్యబాబోయ్.. సుహాస్ సరసన మహేష్ బాబు హీరోయిన్?Suhas{#}CBN;anil music;keerthi suresh;mahesh babu;suhas;Blockbuster hit;salt;Anushka;Mister;Heroine;Tollywood;News;Hero;CinemaWed, 20 Mar 2024 08:30:00 GMTఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు కేవలం స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే కనిపించేవారు. ఇక ఎవరైనా మిడ్ రేంజ్ హీరో సినిమాలో నటిస్తే తమ కెరియర్ దెబ్బతింటుందని కాస్త భయపడేవారు హీరోయిన్లు. కానీ ఇటీవల కాలంలో కథ నచ్చింది అంటే ఆ సినిమాలో నటించబోయేది స్టార్ హీరోనా చిన్న హీరోనా అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. కథను నమ్ముకుంటూ సినిమాలో నటిస్తూ సూపర్ హిట్లు కొడుతున్నారు అని చెప్పాలి. మొన్నటికి మొన్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విషయంలో కూడా ఇదే జరిగింది.


 ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనుష్క శెట్టి టాప్ హీరోయిన్గా కొనసాగుతూ ఉంది. దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇలా స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తుంది.  ఇక దాదాపుగా ఇండస్ట్రీలో ఉన్న అందరూ స్టార్ హీరోలతో జోడి కట్టి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది అని చెప్పాలి. అలాంటి అనుష్క శెట్టి ఇక ప్రస్తుతం చిన్న హీరోగా కొనసాగుతున్న నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అని మూవీలో నటించింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చేసింది. దీంతో ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న మరో టాప్ హీరోయిన్ కూడా ఓ చిన్న హీరో సరసన నటించేందుకు సిద్ధమవుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి.


 ఆ హీరో ఎవరో కాదు సుహాస్. ఇటీవల కాలంలో సుహాస్ ని హీరోగా పెట్టుకుని సినిమా తీస్తే.. మినిమం గ్యారంటీ ఉంటుందని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు. ఇక ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు సుహాష్. ఇతను హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో ఏకంగా మహేష్ బాబు హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ నటించనుందట. అనిల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఉప్పు కప్పురంబు సినిమాలో కీర్తి సురేష్ సుహాస్ సరసన నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>