Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled8ef468d-9b72-4e2c-8dec-27f0fe0f94c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled8ef468d-9b72-4e2c-8dec-27f0fe0f94c1-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గ్లోబల్ వైడ్ గా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హాలీవుడ్ దర్శక దిగ్గజాలను సైతం ఈ ఎంతగానో మెప్పించింది. అయితే ఈ మూవీ రిలీజై రెండేళ్లు గడుస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గలేదు.. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ ఎప్పుడూ వినని తెర వెనుక స్టోరీలు బయటకు వస్తూ ఉన్నాయి.ఈ మూవీ ఆస్కార్స్ గెలుస్తుందని ముందే ఫిక్సయిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మూడు వారాల ముందు నుంచే ఎలా ప్రాక్టీస్ చేశాడో socialstars lifestyle{#}Athadu;m m keeravani;richard;RRR Movie;Rajamouli;Hollywood;Director;Cinemaఆస్కార్ స్పీచ్ కోసం మూడు వారాలు ప్రాక్టీస్ చేసిన కీరవాణి...!!ఆస్కార్ స్పీచ్ కోసం మూడు వారాలు ప్రాక్టీస్ చేసిన కీరవాణి...!!socialstars lifestyle{#}Athadu;m m keeravani;richard;RRR Movie;Rajamouli;Hollywood;Director;CinemaWed, 20 Mar 2024 13:15:00 GMTదర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గ్లోబల్ వైడ్ గా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హాలీవుడ్ దర్శక దిగ్గజాలను సైతం ఈ ఎంతగానో మెప్పించింది. అయితే ఈ మూవీ రిలీజై రెండేళ్లు గడుస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గలేదు.. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ ఎప్పుడూ వినని తెర వెనుక స్టోరీలు బయటకు వస్తూ ఉన్నాయి.ఈ మూవీ ఆస్కార్స్ గెలుస్తుందని ముందే ఫిక్సయిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మూడు వారాల ముందు నుంచే ఎలా ప్రాక్టీస్ చేశాడో డైరెక్టర్ రాజమౌళి వివరించాడు.ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లోనూ అతి పెద్ద హిట్ గా నిలిచింది. 500ల రోజులకుపైనే అవుతున్నా.. అక్కడి థియేటర్లలో ఈ సినిమా ఇంకా ఆడుతూనే ఉంది. దీంతో అక్కడి ప్రేక్షకులతో కలిసి థియేటర్లో ఈ మూవీని చూడటానికి డైరెక్టర్ రాజమౌళి వెళ్లాడు. సినిమా అయిన తర్వాత థియేటర్లోనే అక్కడి ప్రేక్షకులతో మాట్లాడారు.ఈ సందర్భంగా కీరవాణి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "అకాడెమీ అవార్డుల సందర్భంగా మా అన్న కీరవాణి విషయంలో ఓ సరదా ఘటన జరిగింది. అతడు నాటు నాటు పాట కోసం నామినేట్ అయ్యాడు. అవార్డు గెలుస్తామన్న గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఆస్కార్స్ లో మాట్లాడటానికి కేవలం 45 సెకన్ల సమయమే ఇస్తారు. అందువల్ల కీరవాణిని మూడు వారాల ముందు నుంచే స్పీచ్ ప్రాక్టీస్ చేయించాం. అతడు కాస్త లావుగా ఉంటాడు. దీంతో చెయిర్ పై నుంచి లేచి స్టేజ్ పైకి వెళ్లే సమయంలో కాస్త ఊపిరి ఆడనట్లుగా అవుతుంది. అందువల్ల మెల్లగా నడిచి వెళ్లి మాట్లాడమని చెప్పాం. అతన్ని తన చెయిర్ లో నుంచి లేచి వచ్చి మెట్లు ఉన్న వేదికపై ఎక్కి కాస్త ఊపిరి పీల్చుకొని మాట్లాడేలా మూడు వారాల పాటు మేము ప్రాక్టీస్ చేయించాం. కానీ అవార్డు అందుకునే రోజు కీరవాణి తన ప్రాక్టీస్ అంతా పక్కన పెట్టేశాడు. అవార్డు కోసం చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్లాడు. కానీ ఎలాగోలా ఊపిరి బిగపట్టుకొని స్పీచ్ కూడా పూర్తి చేశాడు. టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటూ ఓ పాట కూడా పాడాడు. మరుసటి రోజు మేము ఇంటికి వెళ్లినప్పుడు ఈ పాటను తన కూతుళ్లలో కలిసి రిచర్డ్ కార్పెంటర్ పాడి మా అన్నకు ట్రిబ్యూట్ ఇచ్చాడు. అప్పుడే అతడు కంటతడి పెట్టాడు" అని రాజమౌళి వివరించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>