MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas6f627488-392d-4a12-9de8-b49a1ad358ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas6f627488-392d-4a12-9de8-b49a1ad358ae-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కల్కి 2898 ఏడీ. భారీ బడ్జెట్ తో ఈ మూవీని అశ్వినీ దత్ నిర్మిస్తోన్నారు.ఇండియన్ మైథాలజీ బేస్డ్ గా ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రెడీ అవుతోంది. నాగ్ అశ్విన్ కల్కి మూవీలో కంప్లీట్ న్యూ వరల్డ్ ని చూపించబోతున్నాడు. పైగా ఈ సినిమాలో క్యారెక్టర్స్ తప్ప లొకేషన్స్ అన్ని కూడా ఫిక్షనల్ ప్రపంచంలో నాగ్ అశ్విన్ సృష్టించినవే కావడం విశేషం. కమల్ హాసన్ ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో నటిPrabhas{#}disha patani;Aswani Dutt;krishnam raju;August;vijay kumar naidu;Ashwathama;producer;Producer;Bahubali;Election;Cinema;nag ashwin;Prabhas;Newsకల్కి 2898 ఏడీ: భారీ బిజినెస్ కోసం భారీ ప్లాన్?కల్కి 2898 ఏడీ: భారీ బిజినెస్ కోసం భారీ ప్లాన్?Prabhas{#}disha patani;Aswani Dutt;krishnam raju;August;vijay kumar naidu;Ashwathama;producer;Producer;Bahubali;Election;Cinema;nag ashwin;Prabhas;NewsWed, 20 Mar 2024 16:31:26 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కల్కి 2898 ఏడీ. భారీ బడ్జెట్ తో ఈ మూవీని అశ్వినీ దత్ నిర్మిస్తోన్నారు.ఇండియన్ మైథాలజీ బేస్డ్ గా ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రెడీ అవుతోంది. నాగ్ అశ్విన్ కల్కి మూవీలో కంప్లీట్ న్యూ వరల్డ్ ని చూపించబోతున్నాడు. పైగా ఈ సినిమాలో క్యారెక్టర్స్ తప్ప లొకేషన్స్ అన్ని కూడా ఫిక్షనల్ ప్రపంచంలో నాగ్ అశ్విన్ సృష్టించినవే కావడం విశేషం. కమల్ హాసన్ ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఈ మూవీలో దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మేనెలలో ఈ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఆ సమయంలో ఎలక్షన్స్ ఉండటంతో రిలీజ్ వాయిదా పడబోతోంది. నెక్స్ట్ డేట్ ఎప్పుడు అనేది ప్రస్తుతం చర్చల దశలో ఉంది.  


మేలో అనుకున్న డేట్ క్యాన్సిల్ చేసుకొని జులై 5 కు విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే ఆగష్టు 15న కల్కి మూవీని రిలీజ్ చేసే ఆలోచనతో చిత్ర యూనిట్ ఉంది. కానీ అదే సమయానికి పుష్ప 2 రానుంది. ఆ సినిమా వాయిదా పడితే తప్ప ఆ డేట్ కు సాధ్యం కాకపోవచ్చు.కానీ పుష్ప 2 తగ్గేదే లే అన్నట్లు ఉంది. కల్కి విడుదల తేదీ పై క్లారిటీ రావాల్సి ఉంది.ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేస్తే సినిమా ఎలా ఉండబోతోందనేది ఒక క్లారిటీ వస్తుంది.ఆ టీజర్ అద్భుతంగా ఉండి బాహుబలి రేంజ్ లో రెస్పాన్స్ వస్తే అప్పుడు ఈ సినిమాకి డిమాండ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది.రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ తో ఇంకాస్త ఎక్కువ బజ్ క్రియేట్ అయితే నిర్మాత డిమాండ్ చేసిన భారీ ధర చెల్లించి రైట్స్ తీసుకోవడానికి బయ్యర్లు ముందుకి వచ్చే అవకాశం ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ అద్భుతంగా ఉన్నా దానికి అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. సో టీజర్ తో అయినా అద్భుతమైన అనుభూతి కలిగించి సినిమాకి భారీ బిజినెస్ జరగాలని మేకర్స్ ప్లానింగ్లో ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>