Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4f09fde3-ea6d-4ea7-913f-67b3d63b6b78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4f09fde3-ea6d-4ea7-913f-67b3d63b6b78-415x250-IndiaHerald.jpgగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన మెగా బ్లాక్ బస్టర్ "మగధీర" చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది.ఈ సందర్భంగా పంపిణీదారులు శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు మాట్లాడుతూ ఈ చsocialstars lifestyle{#}GEUM;RRR Movie;Geetha Arts;Ram Charan Teja;Pawan Kalyan;Gift;Kanna Lakshminarayana;sree;Allu Aravind;producer;Producer;Chitram;March;Rajamouli;Blockbuster hit;CBN;Hero;Telugu;Industry;Cinemaరీ రిలీజ్ కు సిద్ధమవుతున్న చరణ్ బ్లాకబస్టర్ మూవీ...!!!రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న చరణ్ బ్లాకబస్టర్ మూవీ...!!!socialstars lifestyle{#}GEUM;RRR Movie;Geetha Arts;Ram Charan Teja;Pawan Kalyan;Gift;Kanna Lakshminarayana;sree;Allu Aravind;producer;Producer;Chitram;March;Rajamouli;Blockbuster hit;CBN;Hero;Telugu;Industry;CinemaTue, 19 Mar 2024 13:30:00 GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన మెగా బ్లాక్ బస్టర్ "మగధీర" చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది.ఈ సందర్భంగా పంపిణీదారులు శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహించి మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అన్నారు.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ అందుకున్న హీరో రామ్ చరణ్. ఆ తరువాత ఇప్పటివరకు రామ్ చరణ్ నటించిన ఫుల్ లెన్త్ సినిమా అయితే రాలేదు.మధ్యలో ఆచార్య చిత్రం వచ్చిన అందులో రామ్ చరణ్ కేవలం గెస్ట్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ హీరో శంకర్ దర్శకత్వంలో రానున్న గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కానీ ఈ చిత్రం దాదాపు మూడు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది.

కాగా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు మెగా పవర్ స్టార్ అభిమానులు. ఈ క్రమంలో ఈ వార్తతో పాటు రామ్ చరణ్ అభిమానులకు మరో శుభవార్త కూడా వినిపిస్తోంది. అదేమిటి అంటే ఆర్ఆర్ఆర్ సినిమా కన్నా ముందు రామ్ చరణ్ రాజమౌళితో చేసిన చిత్రం మగధీర. ఆ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేవలం 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఏకంగా 100 కోట్లు సాధించి రామ్ చరణ్ కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలవడం విశేషం.ఇప్పటికీ ఈ చిత్రం టీవీలో ప్రచారం అయితే చూసేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. మార్చ్ 27 కన్నా ముందు రోజు అనగా మార్చి 26న ఈ చిత్రం రీ రిలీజ్ కానుంది అని తెలుస్తోంది.విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేతలు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎక్కువ థియేటర్స్ లో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇదే విషయాన్ని వీరిద్దరూ అధికారికంగా సోషల్ మీడియాలో కూడా ప్రకటించారు. ఈ అవకాశం వారికి కనిపించినందుకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి ఈ వార్త విని రామ్ చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>