Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle06d4c4d8-4b64-447a-8c78-83b8eae1ca61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle06d4c4d8-4b64-447a-8c78-83b8eae1ca61-415x250-IndiaHerald.jpgకీడా కోలా సినిమాలో దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు గొంతును ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. ఏఐతో బాలసుబ్రహ్మణ్యం లాంటి వాయిస్ సృష్టించి వీరు తమ సినిమాలోని పాటకి వాడుకున్నారు.దానివల్ల ఆ సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో పాటు సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌లపై బాలు కొడుకు చరణ్ బాగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా వారిద్దరికీ నోటీసులు పంపించాడు, భారీ పరిహారం, క్షమాపణ, రాయల్టీ ఇలాంటివన్నీ డిమాండ్స్ చేస్తూ ఆ నోటీసులను అందించాడు.అయితే బాలు గొంతు పై వారసత్వం కలిగే ఉండే హక్కు చరణ్ కి ఉండకపోవచ్చు అనేsocialstars lifestyle{#}vivek;Sangeetha;Singer;Tarun Kumar;court;NTR;Athadu;Father;Cinemaతండ్రి గొంతు ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్న చరణ్...!!!తండ్రి గొంతు ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్న చరణ్...!!!socialstars lifestyle{#}vivek;Sangeetha;Singer;Tarun Kumar;court;NTR;Athadu;Father;CinemaTue, 19 Mar 2024 13:00:00 GMTకీడా కోలా సినిమాలో దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు గొంతును ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. ఏఐతో బాలసుబ్రహ్మణ్యం లాంటి వాయిస్ సృష్టించి వీరు తమ సినిమాలోని పాటకి వాడుకున్నారు.దానివల్ల ఆ సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో పాటు సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌లపై బాలు కొడుకు చరణ్ బాగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా వారిద్దరికీ నోటీసులు పంపించాడు, భారీ పరిహారం, క్షమాపణ, రాయల్టీ ఇలాంటివన్నీ డిమాండ్స్ చేస్తూ ఆ నోటీసులను అందించాడు.అయితే బాలు గొంతు పై వారసత్వం కలిగే ఉండే హక్కు చరణ్ కి ఉండకపోవచ్చు అనేది నిపుణులు చెబుతున్న మాట. బాలు గొంతుపై యావత్ ప్రజానీకానికి, చాలా ఏళ్లుగా అతని పాటలు వింటున్నా శ్రోతలది అని అంటున్నారు. అలాంటప్పుడు ఆ గొంతు పై హక్కులు చరణ్‌కి ఒక్కడికే దక్కుతాయని రేపొద్దున కోర్టు తీర్పు ఇవ్వకపోవచ్చు. దానివల్ల అతడు కేసు వేసి కూడా ఉపయోగం ఉండకపోవచ్చు. ఒకవేళ తన తండ్రి వాయిస్ ని వక్రీకరించి భ్రష్టుపట్టిస్తారని ఫీల్ అయితే దానిని అడ్డుకునే హక్కు అతనికి ఉంటుంది. ఆల్రెడీ కీడా కోలా మూవీ టీం క్షమాపణలు చెప్పారు దాని తర్వాత కూడా చరణ్ రాయల్టీ అడగడం అనేది ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.  ఒకవేళ రాయల్టీ పుచ్చుకుంటే అతడు కూడా బాలు వాయిస్ ను అక్రమంగా వాడుకున్న వారిలో ఒకడు అయిపోతాడు. ఎవరైనా బాలు వాయిస్వా  డుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చినట్లు అవుతుంది. రాయల్టీ తీసుకుంటే క్షమాపణలకు కూడా విలువ లేకుండా పోతుంది. రాయల్ టీ తో పాటు భారీ పరిహారం కూడా చరణ్ తీసుకున్నట్లు కొన్ని నిరాధార వార్తలైతే వస్తున్నాయి. వాటిలో నిజమెంతో తరుణ్ భాస్కర్ కి మాత్రమే తెలియాలి. తరుణ్ భాస్కర్ చరణ్ కి ఎంత డబ్బులు ముట్ట చెప్పాడనేది ప్రస్తుతం క్వశ్చన్‌గా మారింది.   వారంతట వారే ఈ సెటిల్మెంట్ చేసుకున్నారా లేకపోతే ప్రేక్షకులకు తెలిసేలా ఏదైనా చెప్తారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. ఏదేమైనా బాలు చనిపోయాక వారసత్వంగా ఆస్తులు పొందడంతో పాటు అతడి గొంతు ద్వారా కూడా చరణ్ డబ్బులు సంపాదిస్తున్నాడు.నిజానికి తరుణ్ భాస్కర్ కొత్తగా ట్రై చేద్దామని బాలు ఏఐ వాయిస్ ఉపయోగించాం తప్ప మరే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ తదితర దివంగత హీరోల ఏఐ వీడియోలను వాడుకుంటున్నప్పుడు కూడా ఇలాంటి హక్కుల సమస్యలు తలెత్తుతాయా అనే ప్రశ్న కూడా ఇప్పుడు చాలామందిలో కలుగుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>