Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/cable78de1f81-3659-4c75-9643-1888f18077ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/cable78de1f81-3659-4c75-9643-1888f18077ed-415x250-IndiaHerald.jpgమొబైల్ అనేది నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయింది అను విషయం తెలిసిందే. కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు ఏకంగా ఆ మనిషినే బానిసగా మార్చుకుంది. ఆరు అంగుళాల మొబైల్ ఆరడుగుల మనిషిని ఆడిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి. అయితే నేటి రోజుల్లో ఉన్న పరిస్థితుల దృశ్య అటు మొబైల్ లేకుండా కేవలం ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు మనిషి. ఏకంగా బయట ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని సైతం వదులుకొని అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టCable{#}Smart phoneచార్జింగ్ కేబుల్ కు టేప్ అంటించి వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త?చార్జింగ్ కేబుల్ కు టేప్ అంటించి వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త?Cable{#}Smart phoneTue, 19 Mar 2024 08:50:00 GMTమొబైల్ అనేది నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయింది అను విషయం తెలిసిందే. కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు ఏకంగా ఆ మనిషినే బానిసగా మార్చుకుంది. ఆరు అంగుళాల మొబైల్ ఆరడుగుల మనిషిని ఆడిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి. అయితే నేటి రోజుల్లో ఉన్న పరిస్థితుల దృశ్య అటు మొబైల్ లేకుండా కేవలం ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు మనిషి.


 ఏకంగా బయట ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని సైతం వదులుకొని అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టాడు మనిషి. దీంతో మొబైల్ లేకపోతే తన ప్రపంచమే ఆగిపోయింది ఏమో అన్న విధంగా మనిషి ఆలోచన తీరు మారిపోయింది అని చెప్పాలి. అయితే మొబైల్ ఎప్పుడు వాడుతూ ఉండాలి అంటే.. అందులో చార్జింగ్ ఉండాలి. ఛార్జింగ్ ఉండాలి అంటే చార్జింగ్ కేబుల్ సరిగా ఉండాలి. అయితే కొంతమంది చార్జింగ్ కేబుల్ విషయంలో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏకంగా కేబుల్ వైర్ తెగిపోయి లోపల ఉన్న వైర్లు బయటికి వచ్చిన దానికి టేప్ అంటించి మరి వాడటం చేస్తూ ఉంటారు.



 అయితే ఇలా చేయడం ద్వారా కొన్ని కొన్ని సార్లు ఏకంగా కరెంట్ షాక్ కి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా తెగిపోయిన చార్జర్ కేబుల్ కు టేప్ అంటించి వాడటం ప్రమాదకరం అంటూ యూకే లోని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ పరిశోధనలో తేలింది. తాత్కాలికంగా రిపేర్ చేసిన చార్జర్లు వాడితే ఫోన్ పేలిపోవడంతో పాటు ఇక చార్జింగ్ పెట్టే వారికి షాక్ కొట్టె ప్రమాదం కూడా ఉందట. ఇలాంటి ఘటనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో రిపోర్టు తెలిపింది. అయితే నకిలీ నాణ్యత తక్కువగా ఉన్న చార్జర్లు వాడటం కూడా ప్రమాదకరం అంటూ పరిశోధకులు చెప్పుకొచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>