Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle51ad1917-046c-4e53-af11-0deecc3e7fff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle51ad1917-046c-4e53-af11-0deecc3e7fff-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట సింహం గా గుర్తింపు పొందిన బాలయ్య బాబు ప్రస్తుతం తన ఏజ్ కు తగ్గ పాత్రలను పోషిస్తూ ఇండస్ట్రీలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.రీసెంట్ గా ‘భగవంత్ కేసరి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య బాబు ఆ సినిమాలో 50 సంవత్సరాల పైబడిన వ్యక్తిగా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో బాబీ డైరెక్షన్ లో ఎన్ బి కే 109 సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు రాబోతున్నాడు.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజsocialstars lifestyle{#}kodi ramakrishna;Bobby;lion;CBN;Mass;mahesh babu;Balakrishna;Success;Rajamouli;Rajani kanth;News;Cinemaవీళ్ల కాంబినేషన్ లో ఏదైనా సినిమా వచ్చే అవకాశం ఉందా అంటున్న ఫ్యాన్స్....!!!వీళ్ల కాంబినేషన్ లో ఏదైనా సినిమా వచ్చే అవకాశం ఉందా అంటున్న ఫ్యాన్స్....!!!socialstars lifestyle{#}kodi ramakrishna;Bobby;lion;CBN;Mass;mahesh babu;Balakrishna;Success;Rajamouli;Rajani kanth;News;CinemaTue, 19 Mar 2024 15:15:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట సింహం గా గుర్తింపు పొందిన బాలయ్య బాబు ప్రస్తుతం తన ఏజ్ కు తగ్గ పాత్రలను పోషిస్తూ ఇండస్ట్రీలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.రీసెంట్ గా ‘భగవంత్ కేసరి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య బాబు ఆ సినిమాలో 50 సంవత్సరాల పైబడిన వ్యక్తిగా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో బాబీ డైరెక్షన్ లో ఎన్ బి కే 109 సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు రాబోతున్నాడు.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. అది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా బాలయ్య బాబు మరోసారి మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే హింట్ ని కూడా ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో చాలా మంచి పేరును సంపాదించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే 2006 లో మహేష్ బాబు బాలయ్య బాబు కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా ఒక సినిమా రాబోతుంది అంటూ చాలా పెద్ద చర్చ అయితే నడిచింది.ఇక ఈ సినిమాకి కోడి రామకృష్ణ డైరెక్షన్ చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. అయినప్పటికీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇక దాంతో కోడి రామకృష్ణ అరుంధతి సినిమాని చేశాడు. ఇక ఆ తరువాత మహేష్ బాబు, బాలయ్య బాబు ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఒకవేళ వీళ్ళ కాంబినేషన్ లో కనక సినిమా వచ్చినట్టయితే అది సూపర్ డూపర్ హిట్ అయ్యుండేదని ఇప్పటికీ చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.ఇక ఇప్పటికైనా బాలయ్య, మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని అటు మహేష్ బాబు అభిమానులు, ఇటు బాలయ్య బాబు అభిమానులు ఇద్దరు కూడా చాలా కుతూహలంతో ఎదురుచూస్తున్నారు. వీళ్ల కాంబినేషన్ లో ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చే అవకాశం ఉందా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>