MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgసినిమా నిర్మాణాన్ని చాలమంది వ్యాపారంగా చూస్తారు. అయితే అతి కొద్దిమంది మాత్రమే సినిమా అనేది కళకు సంబంధించిన విషయంగా భావిస్తూ వ్యాపార కోణంలో కాకుండా కళాత్మక కోణంలో సినిమాలు తీస్తూ ఉంటారు. ఇలాంటి సినిమాలు తీసిన వారికి ప్రశంసలు లభిస్తాయి కానీ ఆర్థికంగా చాల నష్టపోతూ ఉంటారు. అలాంటి కళాత్మక సినిమాలు తీసి తీవ్రంగా నష్టపోయిన ఒక బాలీవుడ్ దర్శకుడి దీన గాధ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆదర్శకుడి పేరు దేవశిష్ మఖీజా గతఏడాది మనోజ్ బాజ్ పాయ్ తో ‘జొరం’ అనే మూవీ తీశాడు. ఈమూవీకి విమర్శకుల TOLLYWOOD{#}Cycle;Darsakudu;bollywood;Athadu;Thriller;Cinema;Directorఆదర్శకుడి దయనీయ పరిస్థితి !ఆదర్శకుడి దయనీయ పరిస్థితి !TOLLYWOOD{#}Cycle;Darsakudu;bollywood;Athadu;Thriller;Cinema;DirectorTue, 19 Mar 2024 13:33:22 GMTసినిమా నిర్మాణాన్ని చాలమంది వ్యాపారంగా చూస్తారు. అయితే అతి  కొద్దిమంది మాత్రమే సినిమా అనేది కళకు సంబంధించిన విషయంగా భావిస్తూ వ్యాపార కోణంలో కాకుండా కళాత్మక కోణంలో సినిమాలు తీస్తూ ఉంటారు. ఇలాంటి సినిమాలు తీసిన వారికి ప్రశంసలు లభిస్తాయి కానీ ఆర్థికంగా చాల నష్టపోతూ ఉంటారు. అలాంటి కళాత్మక సినిమాలు తీసి తీవ్రంగా నష్టపోయిన ఒక బాలీవుడ్ దర్శకుడి దీన గాధ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.



ఆదర్శకుడి పేరు దేవశిష్ మఖీజా గతఏడాది మనోజ్ బాజ్ పాయ్ తో ‘జొరం’ అనే మూవీ తీశాడు. ఈమూవీకి విమర్శకుల ప్రశంసలతో పాటు బెస్ట్ మూవీ స్టోరీ విభాగాల్లో రెండు ఫిలిం ఫేర్ పురస్కారాలు దక్కాయి. రివ్యూస్ గొప్పగా వచ్చాయి. ఈసినిమాకు జీ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రొడక్షన్ భారం అంతా ఈదర్శకుడి పైనే పడింది. థియేటర్లలో ఘోరంగా ఫెయిలయ్యింది.



టికెట్లు కొని చూసేందుకు ఒక్క ప్రేక్షకుడు కూడ ముందుకు రాలేదు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ థ్రిల్లర్ టచ్ తో ఒక మంచి కాన్సెప్ట్ ని దర్శకుడు ప్రయత్నించినా ఆవిషయాలు సగటు ప్రేక్షకుడుకి అర్థంకాలేదు. కోటి రూపాయలతో తీసిన ఆసినిమాకు కేవలం 15 లక్షలు మాత్రమే కలక్షన్స్ వచ్చాయి అని అంటారు. వాస్తవానికి దేవశిష్ ప్రతిభ ఏమాత్రం చిన్నది కాదు.  అతడికి చక్కని ట్రాక్ రికార్డు ఉంది.



బంటీ ఔర్ బబ్లీ బ్లాక్ ఫ్రైడే లాంటి క్లాసిక్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. చిన్నపిల్లల సాహిత్యంలో బెస్ట్ సెల్లర్స్ గా నిలిచిన పుస్తకాలు రాశాడు. ప్రత్యేకంగా ఈయన  తీసిన షార్ట్ ఫిలిమ్స్ చాల గొప్ప పేరును  తెచ్చి పెట్టాయి. నాలుగు పదుల వయసులో ఉన్న ఈదర్శకుడు తన వద్ద కనీసం సైకిల్ కొనుక్కునే డబ్బులు కూడ ఇప్పుడు లేవని గగ్గోలు  పెడుతున్నాడు. 40కి పైగా ఫుల్ బౌండ్ స్క్రిప్టులు తన దగ్గర ఉన్నాయని ఎవరైనా అడిగితే సినిమాలు తీయడానికి ఇస్తాను అంటూ అతడు చేసిన సంచలన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది..






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>