MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/young-heroines-to-turn-siblings-for-chiranjeevi186671ee-b025-4df6-9336-a3e13f99e6f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/young-heroines-to-turn-siblings-for-chiranjeevi186671ee-b025-4df6-9336-a3e13f99e6f2-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి సినిమా మొదలు అయ్యింది అంటే ఆ సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అంతలా ప్రేక్షకులు చిరంజీవి సినిమాలో పాటల కోసం ఎదురు చూసేది ఆయన డాన్స్ కోసం. చిరంజీవి స్టార్ హీరో అయ్యాడు అంటే ఆయన నటన , వ్యక్తిత్వం ఎంత ముఖ్య పాత్రను పోషించిందో అలాగే సినిమాల్లో ఆయన చేసిన డ్యాన్స్ కూడా అంతే ముఖ్య పాత్రను పోషించింది. ముఖ్యంగా ఈయన కొన్ని సంవత్సరాల క్రితం సీనియర్ హీరోలలో ఎవరూ చేయలేనంత గ్రేస్ తో డ్యాన్స్ ను చేసి ఆ సమయంలో సినీ ప్రేమికులను ఎంతో ఆహ్లాదపరిచాడు. chiru{#}Chiranjeevi;sekhar;Joseph Vijay;Sekhar Master;Master;Trisha Krishnan;Audience;Hero;Heroine;Cinema"విశ్వంభర" పాటలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లు వీరే..?"విశ్వంభర" పాటలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లు వీరే..?chiru{#}Chiranjeevi;sekhar;Joseph Vijay;Sekhar Master;Master;Trisha Krishnan;Audience;Hero;Heroine;CinemaMon, 18 Mar 2024 12:56:00 GMTమెగాస్టార్ చిరంజీవి సినిమా మొదలు అయ్యింది అంటే ఆ సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అంతలా ప్రేక్షకులు చిరంజీవి సినిమాలో పాటల కోసం ఎదురు చూసేది ఆయన డాన్స్ కోసం. చిరంజీవి స్టార్ హీరో అయ్యాడు అంటే ఆయన నటన , వ్యక్తిత్వం ఎంత ముఖ్య పాత్రను పోషించిందో అలాగే సినిమాల్లో ఆయన చేసిన డ్యాన్స్ కూడా అంతే ముఖ్య పాత్రను పోషించింది. ముఖ్యంగా ఈయన కొన్ని సంవత్సరాల క్రితం సీనియర్ హీరోలలో ఎవరూ చేయలేనంత గ్రేస్ తో డ్యాన్స్ ను చేసి ఆ సమయంలో సినీ ప్రేమికులను ఎంతో ఆహ్లాదపరిచాడు.

ఇకపోతే ఇప్పటికే 60 సంవత్సరాల వయసు దాటినా కూడా చిరంజీవి తన అద్భుతమైన డాన్స్ తో ప్రేక్షకులను ఎంతో అలరిస్తూ వస్తున్నాడు. దానితో చిరంజీవి పాటలకు కొరియో గ్రాఫర్ గా వ్యవహరించినట్లు అయితే ఆ డాన్స్ మాస్టర్ లకి కూడా మంచి గుర్తింపు లభిస్తూ వస్తుంది. దానితో ఆయన సినిమాలకు ఎప్పుడు కొరియోగ్రఫీ చేస్తామా అని ఎంతో మంది పెద్ద పెద్ద డాన్స్ కొరియో గ్రాఫర్ లు కూడా ఆయన సినిమా ఆఫర్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో అనేక డాన్స్ నెంబర్ లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పాటలకు శోభి మాస్టర్ , విజయ్ బిన్నీ మాస్టర్ మరి అలాగే మరి కొంత మంది డాన్స్ మాస్టర్ లు ఈ సినిమాలోని పాటలకు కొరియో గ్రాఫర్ లుగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గత కొంత కాలంగా శేఖర్ మాస్టర్... చిరంజీవి సినిమాలకు కచ్చితంగా పని చేస్తూ వస్తున్నాడు. కానీ ఈ సినిమాలో మాత్రం శేఖర్ మాస్టర్ ఏ సాంగ్ కి కూడా కొరియో గ్రఫీ చేయడం లేదు అని తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>