MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/singer-magali-accedent-safe980d5d83-f02b-43d1-a789-b20cb154add8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/singer-magali-accedent-safe980d5d83-f02b-43d1-a789-b20cb154add8-415x250-IndiaHerald.jpgసింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. గాయనిగా ప్రైవేట్ ఆల్బమ్స్ పాడి మంచి పాపులారిటీ సంపాదించుకున్న మంగ్లీ తెలంగాణ భాషలలో కూడా పాటలు పాడి భారీ క్రేజీ సంపాదించుకుంది. పలు సినిమాలలో పాటలు కూడా పాడడం జరిగింది మంగ్లీ.. అయితే ఇప్పుడు తాజాగా మంగ్లీ కి పెను ప్రమాదం తప్పిందని ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారు డీసీఎం వెనుక నుంచి ఢీ కొట్టడంతో స్వల్ప గాయాలయ్యాయని సమాచారం.. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పైన తొండుపల్లి వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్SINGER MAGALI;ACCEDENT;SAFE{#}Ranga Reddy;Tondupally;Mangli;Shamshabad;Driver;Car;Saturday;District;Hyderabad;News;Teluguషాక్: సింగర్ మంగ్లీ కి తప్పిన ప్రమాదం..!!షాక్: సింగర్ మంగ్లీ కి తప్పిన ప్రమాదం..!!SINGER MAGALI;ACCEDENT;SAFE{#}Ranga Reddy;Tondupally;Mangli;Shamshabad;Driver;Car;Saturday;District;Hyderabad;News;TeluguMon, 18 Mar 2024 10:00:00 GMTసింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. గాయనిగా ప్రైవేట్ ఆల్బమ్స్ పాడి మంచి పాపులారిటీ సంపాదించుకున్న మంగ్లీ తెలంగాణ భాషలలో కూడా పాటలు పాడి భారీ క్రేజీ సంపాదించుకుంది. పలు సినిమాలలో పాటలు కూడా పాడడం జరిగింది మంగ్లీ.. అయితే ఇప్పుడు తాజాగా మంగ్లీ కి పెను ప్రమాదం తప్పిందని ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారు డీసీఎం వెనుక నుంచి ఢీ కొట్టడంతో స్వల్ప గాయాలయ్యాయని సమాచారం.. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పైన తొండుపల్లి వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.


రంగారెడ్డి జిల్లా నందిగామ కన్య ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో మంగ్లీ కారు ప్రమాదానికి గురైందని శంషాబాద్ పోలీసులు వెల్లడించారు.. శనివారం రోజున రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి కన్హా శాంతి ఆధ్యాత్మిక మహోత్సవానికి వెళ్లిన ఈమె ఆ తర్వాత అర్ధరాత్రి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందట. తొండిపల్లి సమీపం రాగానే మంగ్లీ కారు ఓ డి సి ఎం వాహనం వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టిందని కారులో ప్రయాణిస్తున్న మేఘరాజ్ మనోహర్ లతో సహా మంగ్లీ ఉన్నట్టుగా తెలుస్తోంది.


అయితే వీరు ముగ్గురు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారని డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సంఘటన పైన సింగర్ మంగ్లీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి ప్రమాదంలో మంగ్లీ కారు పూర్తిగా దెబ్బతిన్నట్టుగా సమాచారం.. గతంలో ఎక్కువగా సినిమాల పాటలు పాడిన మంగ్లీ ఈ మధ్యకాలంలో ఈమె హవ కాస్త తగ్గిందని చెప్పవచ్చు.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది సింగర్ మంగ్లీ.. ఈమె చెల్లెలు కూడా ఇటీవలే సింగర్ గా ఎంట్రీ ఇచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>