MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమార్చి 29న జొన్నలగడ్డ సిద్ధు ‘టిల్లు స్క్వేర్’ విడుదల కావలసి ఉంది. ఈసినిమా విడుదలకు ఇక కేవలం 12 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుకావడం లేదు. ఈసినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది అంటున్నారు. ఈమూవీ డబ్బింగ్ పనులు కూడ ఇంకా పూర్తి కాలేదనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ ఫిబ్రవరిలో వ్యాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలకావలసి ఉంది. అప్పటికి ఈమూవీ అవుట్ పుట్ విషయంలో సిద్ధూ జొన్నలగడ్డ కు పూర్తి సంతృప్తి లేకపోవడంతో ఈమూవీని మారtillusequre{#}vijay deverakonda;Industry;Telugu;March;Cinemaటిల్లు కు ఏమైంది !టిల్లు కు ఏమైంది !tillusequre{#}vijay deverakonda;Industry;Telugu;March;CinemaMon, 18 Mar 2024 10:00:00 GMTమార్చి 29న జొన్నలగడ్డ సిద్ధు ‘టిల్లు స్క్వేర్’ విడుదల కావలసి ఉంది. ఈసినిమా విడుదలకు ఇక కేవలం 12 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుకావడం లేదు. ఈసినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది అంటున్నారు.



ఈమూవీ డబ్బింగ్ పనులు కూడ ఇంకా పూర్తి కాలేదనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ ఫిబ్రవరిలో వ్యాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలకావలసి ఉంది. అప్పటికి ఈమూవీ అవుట్ పుట్ విషయంలో సిద్ధూ జొన్నలగడ్డ కు పూర్తి సంతృప్తి లేకపోవడంతో ఈమూవీని మార్చి నెలాఖరకు వాయిదా వేశాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈమూవీ వాయిదా పడుతుందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.



అనుకున్న ప్రకారం మార్చి 29 డేట్ ‘టిల్లు’ మిస్ అయితే ఈసినిమాను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు బాగా ఖంగారు పడే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఏప్రియల్ 5న ‘ఉగాది’ పండుగను టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ వస్తోంది. ఈసినిమా పై అంచనాలు బాగా ఉండటంతో ఈమూవీ హడావిడి కనీసం రెండు వారాలు ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి.



ఆతరువాత తెలుగు రాష్ట్రాలయాలో ఎన్నికల హడావిడి మొదలు అవ్వడంతో మే 13 వరకు జనం సినిమాలా కంటే రాజకీయాలనే ఎక్కువడా పట్టించు కుంటూ ఉంటారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన నేపధ్యంలో సరైన యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ మూవీ పడితే కలక్షన్స్ హోరెత్తి పోవడం ఖాయం. దీనితో ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ పై ఎందుకు క్లారిటీ రావడంలేదు అంటూ జొన్నలగడ్డ అభిమానులు విపరీతంగా టెన్షన్ పడిపోతున్నట్లు టాక్. అయితే ఈమూవీ యూనిట్ నుంచి వస్తున్న సంకేతాలు మరొక విధంగా ఉంటున్నాయి. ఎట్టి పరిస్థితులలోను తమ సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేసి తీరుతామని కొంతమంది అనవసరంగా తమ మూవీ పై పుకార్లు పుట్టిస్తున్నారని ఈమూవీ బయ్యర్లకు ధైర్యం చెపుతున్నట్లు టాక్..  








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>