Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/charan67620fa2-9337-48ce-94c5-b84333483732-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/charan67620fa2-9337-48ce-94c5-b84333483732-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా కొనసాగుతూ ఉన్నాడు రాజమౌళి. ఒకప్పుడు టాలీవుడ్ కి మాత్రమే రాజమౌళి క్రేజ్ పరిమితం అయ్యేది. కానీ బాహుబలి సినిమా వరల్డ్ వైడ్ హిట్ తర్వాత ఇక రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది అని చెప్పాలి. అంతేకాదు ఎప్పుడు టాలీవుడ్ ను చులకనగా చూసే బాలీవుడ్ బడా స్టార్స్ సైతం టాలీవుడ్ వైపు ఆశ్చర్యంగా చూసేలా చేసింది బాహుబలి సినిమా. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచాడు రాజమౌళి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడుగCharan{#}Chiranjeevi;Ram Charan Teja;Rajamouli;Industries;Telugu;Bahubali;Magadheera;Master;Chirutha;bollywood;Indian;Blockbuster hit;Tollywood;Cinemaరీ రిలీజ్ కు సిద్ధమైన.. రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ?రీ రిలీజ్ కు సిద్ధమైన.. రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ?Charan{#}Chiranjeevi;Ram Charan Teja;Rajamouli;Industries;Telugu;Bahubali;Magadheera;Master;Chirutha;bollywood;Indian;Blockbuster hit;Tollywood;CinemaMon, 18 Mar 2024 22:00:00 GMTఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా కొనసాగుతూ ఉన్నాడు రాజమౌళి. ఒకప్పుడు టాలీవుడ్ కి మాత్రమే రాజమౌళి క్రేజ్ పరిమితం అయ్యేది. కానీ బాహుబలి సినిమా వరల్డ్ వైడ్ హిట్ తర్వాత ఇక రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది అని చెప్పాలి. అంతేకాదు ఎప్పుడు టాలీవుడ్ ను చులకనగా చూసే బాలీవుడ్ బడా స్టార్స్ సైతం టాలీవుడ్ వైపు ఆశ్చర్యంగా చూసేలా చేసింది బాహుబలి సినిమా. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచాడు రాజమౌళి.


 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడుగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఏదైనా సినిమా వచ్చింది అంటే ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయమని ప్రస్తుతం ప్రతి ఒక్క ప్రేక్షకుడి భావన. ఎందుకంటే ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాల్లో కూడా అంతటి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి అని చెప్పాలి. అయితే మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ స్టార్ హీరోని చేయడమే కాదు ఏకంగా గ్లోబల్ స్టార్ గా చేసింది కూడా జక్కన్న అని చెప్పాలి.


 మొన్నటికి మొన్న త్రిబుల్ ఆర్ సినిమాతో అటు చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగితే.. ఇక చిరుత లాంటి డెబ్యూ మూవీ తర్వాత చరణ్ తో మగధీర సినిమా తీసి ఈ మెగా హీరోని స్టార్ హీరోని చేశాడు రాజమౌళి. అయితే మగధీర సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ ఉండగా.. ఇక రాజమౌళి కెరియర్ లో బ్లాక్ బస్టర్ అయిన మగధీర సినిమాను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఈనెల 26వ తేదీన చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సలహాలు చేస్తున్నట్లు సిని వర్గాల నుంచి సమాచారం. దీంతో మరోసారి ఈ మాస్టర్ పీస్ మూవీ సెన్సేషన్ సృష్టించడం ఖాయమని చరణ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>