PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kavita-delhi-liquor-scam-bjp964eaf25-c396-42d7-bb4b-e7ce869134db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kavita-delhi-liquor-scam-bjp964eaf25-c396-42d7-bb4b-e7ce869134db-415x250-IndiaHerald.jpgసెక్షన్ 19 ప్రకారం కవిత అరెస్టు జరిగిందా లేదా అన్నది మాత్రమే తాము చూసినట్లు కోర్టు చెప్పింది. కవిత అరెస్టులో ఎక్కడా చట్టఉల్లంఘన జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. కవిత నేరానికి పాల్పడ్డారని అనేందుకు అన్నీ ఆధారాలున్నాయని కూడా కోర్టు అభిప్రాయపడింది. నేరాల్లో కవిత కీలకపాత్ర పోషించారనేందుకు ఈడీ దగ్గర చాలా ఆధారాలున్నట్లు కోర్టు ప్రకటించింది. కాకపోతే ఆమె విచారణను సీసీటీవీ కవరేజిలోనే చేయాలని, సదరు ఫుటేజిని భద్రపరచాలని ఆదేశించింది.kavita delhi liquor scam bjp{#}KCR;kavitha;Hyderabad;court;Delhiఢిల్లీ : కవితకు షాకిచ్చిన కోర్టుఢిల్లీ : కవితకు షాకిచ్చిన కోర్టుkavita delhi liquor scam bjp{#}KCR;kavitha;Hyderabad;court;DelhiMon, 18 Mar 2024 03:00:00 GMTమనీల్యాండరింగ్ ఆరోపణలపై  అరెస్టయిన కల్వకుంట్ల కవతకు కోర్టు పెద్ద షాకిచ్చింది. మూడు రోజుల క్రితం ఢిల్లీ నుండి ఈడీ, ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారుల బృందాలు హైదరాబాద్ లో కవిత ఇంట్లో సోదాలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని గంటలపాటు సోదాలు చేసిన ఉన్నతాధికారుల బృందాలు చివరకు కవిత అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. మనీల్యాండరింగ్ లో కవిత పాత్రపై ఆరోపణలున్నాయి కాబట్టే అరెస్టు చేస్తున్నట్లు చెప్పాయి.





అన్నీ అధారాలతోనే తాము హైదరాబాద్ లోని ఆమె ఇంట్లో సోదాలు చేసినట్లు, అరెస్టు చేసినట్లు ఈడీ ప్రకటించింది. హైదరాబాద్ లో అరెస్టుచేసిన కవితను ఢిల్లీకి తీసుకెళ్ళింది. ఢిల్లీకి తీసుకెళ్ళిన కవితను ఈడీ రౌస్ అవెన్యు కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ నేపధ్యంలోనే కవితకు కోర్టు వారంరోజుల కస్టడీ విధించింది. కస్టడీ సందర్భంగా కోర్టు పలుకీలకమైన వ్యాఖ్యలు చేసింది. కవిత అరెస్టు చట్టబద్దమే అని తేల్చేసింది. కవితను అరెస్టుచేయద్దని సుప్రింకోర్టు ఎప్పుడూ చెప్పలేదన్నది.





సెక్షన్ 19 ప్రకారం కవిత అరెస్టు జరిగిందా లేదా అన్నది మాత్రమే తాము చూసినట్లు కోర్టు చెప్పింది. కవిత అరెస్టులో ఎక్కడా చట్టఉల్లంఘన జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. కవిత నేరానికి పాల్పడ్డారని అనేందుకు అన్నీ ఆధారాలున్నాయని కూడా కోర్టు అభిప్రాయపడింది. నేరాల్లో కవిత కీలకపాత్ర పోషించారనేందుకు ఈడీ దగ్గర చాలా ఆధారాలున్నట్లు కోర్టు ప్రకటించింది. కాకపోతే ఆమె విచారణను సీసీటీవీ కవరేజిలోనే చేయాలని, సదరు  ఫుటేజిని భద్రపరచాలని ఆదేశించింది.





మహిళలను విచారించేటపుడు తీసుకోవాల్సిన అన్నీ జాగ్రత్తలను తీసుకోవాలని గట్టిగా చెప్పింది. ఆమెను కలుసుకోవటానికి రోజుకు అర్ధగంట పాటు లాయర్, సోదరుడు కేటీయార్ తదితరులకు అనుమతించింది. దేన్నయితే తప్పించుకోవాలని కవిత ఇంతకాలం ప్రయత్నిస్తున్నారో చివరకు దానికే తలొంచక తప్పలేదు. అరెస్టును తప్పించుకుందామని కవిత ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చాలామందిని అరెస్టు చేయగలిగిన ఈడీ కవితను మాత్రం ఇంతకాలం టచ్ చేయలేకపోయింది. కేసీయార్ అధికారంలో ఉన్న కారణంగానే కవిత అరెస్టు జరగలేదని అనుకుంటున్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో అప్పటినుండే కవిత కష్టాలు మొదలయ్యాయి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>