EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan6a97fac5-87d4-4ab9-83fd-eda9a46e094b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan6a97fac5-87d4-4ab9-83fd-eda9a46e094b-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇందులో కమ్మ సామాజిక వర్గాన్ని చూసుకుంటే ఒక బలమైన, శక్తిమంతమైన వర్గం. 1982 నుంచి ఏపీ రాజకీయాల్లో వీరు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అలాంటిది రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో వీరి పాత్ర పరిమితమైంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఇది స్పష్టం అవుతుంది. ఈ క్రమంలో వారంతా టీడీపీ అధినేతపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో చంద్రబాబు నాయుడి వీరికి 28 సీట్లను కేటాయించారు. ఇప్పటి వరకు చూసుకుంటే టీడీపీ లో అత్యధికంగా కమ్మ సామాజికjagan{#}Kamma;Parliment;Reddy;Andhra Pradesh;TDP;Jagan;Bharatiya Janata Party;YCP;CBN;CM;Telanganaసీట్ల కేటాయింపులో కమ్మలకు జగన్‌ అవమానం?సీట్ల కేటాయింపులో కమ్మలకు జగన్‌ అవమానం?jagan{#}Kamma;Parliment;Reddy;Andhra Pradesh;TDP;Jagan;Bharatiya Janata Party;YCP;CBN;CM;TelanganaMon, 18 Mar 2024 13:00:00 GMTఏపీ రాజకీయాల్లో సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇందులో కమ్మ సామాజిక వర్గాన్ని చూసుకుంటే ఒక బలమైన, శక్తిమంతమైన వర్గం. 1982 నుంచి ఏపీ రాజకీయాల్లో వీరు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అలాంటిది రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో వీరి పాత్ర పరిమితమైంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఇది స్పష్టం అవుతుంది.

 
ఈ క్రమంలో వారంతా టీడీపీ అధినేతపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో చంద్రబాబు నాయుడి వీరికి 28 సీట్లను కేటాయించారు. ఇప్పటి వరకు చూసుకుంటే టీడీపీ లో అత్యధికంగా కమ్మ సామాజిక వర్గానకే సీట్లు ఇచ్చారు. కానీ మొత్తంగా చూసుకుంటే రెడ్లు అధిక సంఖ్యలో ఉన్నారు. టీడీపీ, వైసీపీ కలిసి రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వైసీపీ 49 సీట్లను రెడ్డకు కేటాయించింది. టీడీపీ కూడా ఇప్పటి వరకు 28మందికి ఇచ్చింది. ఇంకా 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.


మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించిన సీట్లు తగ్గిపోయాయి. టీడీపీ 28 ఇస్తే.. వైసీపీ 9 సీట్లను మాత్రమే కేటాయించింది. గతంలో పది సీట్లు ఇచ్చిన సీఎం జగన్ ఈసారి వారికి ఒకటి కోత పెట్టి తొమ్మిదికి పరిమితం చేశారు. రాజకీయంగా ఈ సామాజిక వర్గం అంతా కూడా టీడీపీ వైపే మొగ్గు చూపుతారు. కాబట్టి వీరి ప్రాబల్యాన్ని జగన్ తగ్గించే ప్రయత్నం చేశారు.


పార్లమెంట్ స్థానాల్లో కూడా గత ఎన్నికల్లో మూడు స్థానాలు ఇవ్వగా ఈసారి ఒకటికే  తగ్గించేశారు. మరి టీడీపీ మిగతా జాబితా.. జనసేన, బీజేపీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనే లెక్కలు చూసుకుంటే వీరి ప్రాధాన్యం తెలిసే అవకాశం ఉంది. కూటమి సీట్లు అనంతరం రెడ్లతో పాటు కమ్మలకు సమానంగా సీట్లు ఇస్తారా లేదా అనేది తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>