Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4919acfc-9bc6-4879-bcf2-78f12fa4698f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4919acfc-9bc6-4879-bcf2-78f12fa4698f-415x250-IndiaHerald.jpgస్టార్‌ హీరో సినిమాకి స్వీటి అనుష్క శెట్టి నో చెప్పింది. కానీ త్రిష గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఇద్దరు కలిసి డబుల్‌ హ్యాట్రిక్‌కి సిద్ధమవుతున్నారు.ఇదే ఇంట్రెస్టింగ్‌గా మారింది.అనుష్క శెట్టి ఓ రకంగా కమ్‌ బ్యాక్‌ అవుతుంది. ఆమె అధిక బరువు కారణంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె నార్మల్‌ వెయిట్‌కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవలే ఓ మలయాళ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇదిషూటింగ్‌ కూడా ప్రారంభమయ్యింది. అంతకు ముందుకు తెలుగులో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో నటించి హిట్socialstars lifestyle{#}anoushka;Kuruvi;Dalapathi;choudary actor;Trisha Krishnan;Joseph Vijay;Cinema;Anushka;Hero;Posters;Fatherఅనుష్క శెట్టి నో చెప్పిన ఆ సినిమాకి త్రిష గ్రీన్‌ సిగ్నల్..!!!అనుష్క శెట్టి నో చెప్పిన ఆ సినిమాకి త్రిష గ్రీన్‌ సిగ్నల్..!!!socialstars lifestyle{#}anoushka;Kuruvi;Dalapathi;choudary actor;Trisha Krishnan;Joseph Vijay;Cinema;Anushka;Hero;Posters;FatherMon, 18 Mar 2024 17:45:00 GMTస్టార్‌ హీరో సినిమాకి స్వీటి అనుష్క శెట్టి నో చెప్పింది. కానీ త్రిష గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఇద్దరు కలిసి డబుల్‌ హ్యాట్రిక్‌కి సిద్ధమవుతున్నారు.ఇదే ఇంట్రెస్టింగ్‌గా మారింది.అనుష్క శెట్టి ఓ రకంగా కమ్‌ బ్యాక్‌ అవుతుంది. ఆమె అధిక బరువు కారణంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె నార్మల్‌ వెయిట్‌కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవలే ఓ మలయాళ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇదిషూటింగ్‌ కూడా ప్రారంభమయ్యింది. అంతకు ముందుకు తెలుగులో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో నటించి హిట్‌ అందుకుంది. కొంత గ్యాప్‌తో ఈ మలయాళ మూవీకి ఒప్పుకుంది.అయితే అనుష్క.. మరో స్టార్‌ హీరో సినిమాకి నో చెప్పిందట. అదే దళపతి విజయ్‌ మూవీకి. ప్రస్తుతం విజయ్‌.. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో `ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌(గోట్‌) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రికొడుకులుగా కనిపించబోతున్నారు విజయ్‌. అయితే తండ్రి పాత్రకి జోడీగా అనుష్క శెట్టిన సంప్రదించారట టీమ్‌. కానీ ఆమె నో చెప్పిందట. పాత్ర నిడివి కాసేపే ఉండటంతో ఆమె తిరస్కరించిందని సమాచారం.ఈ క్రమంలో త్రిషని అప్రోచ్‌ కాగా, ఓకే చెప్పిందని సమాచారం. ఎందుకంటే విజయ్‌, త్రిష కలిసి చివరగా లియో మూవీలో నటించి హిట్‌ అందుకున్నారు. ఇదే కాదు, గతంలో వీరి కాంబినేషన్‌లో ఆది, గిల్లీ, తిరుపాచ్చి, కురువి సినిమాల్లో నటించారు. హిట్‌ పెయిర్‌గా నిలిచారు. ఇప్పుడు గోట్‌ మూవీతో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. `గోట్‌`మూవీతో మరోసారి సందడి చేసేందుకు వస్తున్నారు.

ఈ మూవీలో యంగ్‌ విజయ్‌కి మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వీరితోపాటు స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. చెన్నైలో షూట్‌ చేస్తున్నారట. ఆ మధ్య సెట్‌ నుంచి విజయ్‌ ఫోటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికే ఫస్ట్ లుక్‌ పోస్టర్లు కూడా వచ్చాయి. అవి ట్రోల్‌కి గురయ్యాయి.ఇదిలా ఉంటే త్రిష మళ్లీ పుంజుకుంది. ఆ మధ్య ఆమెకి సినిమాల విషయంలో గ్యాప్ వచ్చింది. మంచి కథలను ఎంచుకునే క్రమంలో బ్రేక్‌ తీసుకుంది. పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. విజయ్‌తో లియో చేసింది. దీంతోపాటు ఇప్పుడు తెలుగులో చిరంజీవితో విశ్వంభర`లో నటిస్తుంది. అలాగే కమల్‌ హాసన్‌తో `థగ్స్ లైఫ్‌, అజిత్‌తో విడాముయర్చి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మలయాళంలోనూ ఓ మూవీ చేస్తుందని టాక్‌.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>