MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgరణబీర్ కపూర్ ను పెళ్ళి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత కూడ అలియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కథ నచ్చితే చాలు తన పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ నటించే విషయంలో ముందుకు వచ్చే అలియా కోసం అనేకమంది దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. తాను నటించే సినిమాకు 15 కోట్లకు తక్కువ కాకుండ పారితోషికం తీసుకునే ఈమె డిమాండ్స్ ఏస్థాయిలో ఉన్నప్పటికీ వాటిని నెరవేర్చడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. లేటెస్ట్ గా ఆమె ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసRAJAMOULI{#}kirti;Rajamouli;Alia Bhatt;media;bollywood;Cinema;Newsఅలియా భట్ బయటపెట్టిన రాజమౌళి సలహా !అలియా భట్ బయటపెట్టిన రాజమౌళి సలహా !RAJAMOULI{#}kirti;Rajamouli;Alia Bhatt;media;bollywood;Cinema;NewsMon, 18 Mar 2024 09:00:00 GMTరణబీర్ కపూర్ ను పెళ్ళి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత కూడ అలియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కథ నచ్చితే చాలు తన పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ నటించే విషయంలో ముందుకు వచ్చే అలియా కోసం అనేకమంది దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. తాను నటించే సినిమాకు 15 కోట్లకు తక్కువ కాకుండ పారితోషికం తీసుకునే ఈమె డిమాండ్స్ ఏస్థాయిలో ఉన్నప్పటికీ వాటిని నెరవేర్చడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.



లేటెస్ట్ గా ఆమె ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ఆమె పాత్రను రాజమౌళి తగ్గించి వేయడంతో అలియా భట్ జక్కన్న పై అసహనంగా ఉంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలను అటు రాజమౌళి కానీ ఇటు అలియా భట్ కానీ ఖండించక పోవడంతో అలియా నిజంగానే జక్కన్న పై అసహనంగా ఉందా అన్న సందేహాలు కొందరికి వచ్చాయి.



దీనికి కొనసాగింపుగా ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన తరువాత జరిగిన ఆమూవీ ప్రమోషన్స్ లో ఎక్కడా అలియా కనిపించక పోవడంతో ఆమె ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ పై కోపగించింది అంటూ అనేక గాసిప్పులు మళ్ళీ వచ్చాయి. అయితే ఆతరువాత ఆవిషయాన్ని మీడియా వర్గాలు అలియా అభిమానులు అందరు మర్చిపోయారు. అయితే అనూహ్యంగా అలియా తన ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రస్తావన తీసుకు వచ్చి తనకు జక్కన్న పై ఎటువంటి కోపం లేదు అన్న విషయాన్ని పరోక్షంగా తెలియచేసింది.



‘ఎలాంటి సినిమా ఒప్పుకున్నా ఎలాంటి పాత్రను చేసిన దానిని ప్రేమించమనీ ఆపాత్రకోసం తన బెస్ట్ ఎఫర్ట్ ఇమ్మని అప్పుడే గౌరవం డబ్బు కీర్తి వాటంతట అవే వస్తాయి’ అంటూ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ మొదటిరోజున తనకు చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది, ఆమాటలు తనకు బాగా నచ్చడంతో తాను భవిష్యత్ లో ఒప్పుకునే సినిమాల విషయంలో తనకు స్పూర్తి దాయకంగా మారాయి అంటూ అలియా భట్ మరొకసారి జక్కన్న పై ప్రశంసలు కురిపించింది..    


 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>