Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1df7db0c-8857-48a4-b174-aef122cc5f06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1df7db0c-8857-48a4-b174-aef122cc5f06-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ అభిమానులకు హీరోయిన్ రాశీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సత్తా చాటించింది.తెలుగులో అగ్ర హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఆకతాయి’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రాశీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. ‘అమ్మో ఒకటో తారీఖు’, ‘చెప్పాలని ఉంది’, ‘శ్రీరామచంద్రులు’, ‘దీవించండి’, ‘దేవుళ్లు’, ‘నాగ ప్రతిష్ట’, ‘పెళ్లి పందిరి’, ‘శుభాకాంకsocialstars lifestyle{#}Ishtam;Makeup;Blockbuster hit;marriage;raasi;Heroine;Cinemaఆ ఒక్క విషయం నన్ను సినిమాలకు దూరం చేసింది..???ఆ ఒక్క విషయం నన్ను సినిమాలకు దూరం చేసింది..???socialstars lifestyle{#}Ishtam;Makeup;Blockbuster hit;marriage;raasi;Heroine;CinemaMon, 18 Mar 2024 13:32:58 GMTతెలుగు సినీ అభిమానులకు హీరోయిన్ రాశీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సత్తా చాటించింది.తెలుగులో అగ్ర హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఆకతాయి’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రాశీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. ‘అమ్మో ఒకటో తారీఖు’, ‘చెప్పాలని ఉంది’, ‘శ్రీరామచంద్రులు’, ‘దీవించండి’, ‘దేవుళ్లు’, ‘నాగ ప్రతిష్ట’, ‘పెళ్లి పందిరి’, ‘శుభాకాంక్షలు’ సహా పలు హిట్ సినిమాలు చేసింది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న క్రమంలోనే, బుల్లితెరపైనా సత్తా చాటింది. ‘గిరిజా కల్యాణం’, ‘జానకి కలగనలేదు’ సహా పలు సీరియల్స్ లో కనిపించింది. పెళ్లి తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరం అయ్యింది. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇప్పటికే ‘రాఘవరెడ్డి’ అనే సినిమాలో చేసింది. ఇందులో నందితా శ్వేతకు తల్లిగా కనిపించింది. ప్రస్తుతం వరుస సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ.. తాను సినిమాల నుంచి దూరం కావడానికి అసలు కారణం చెప్పుకొచ్చింది. సినిమాలకు తాను దూరం కావాలి అనుకున్నానే తప్ప, సినిమాలు తనని వద్దు అనుకోలేదని వెల్లడించింది. “రాశీ సినిమాలను వద్దు అనుకుంది. కానీ, సినిమాలు రాశిని వద్దు అనుకోలేదు. ఇప్పటికీ నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే, అచితూచి నిర్ణయం తీసుకుంటున్నాను. నటనా ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రను చేయడానికైనా రెడీ. తల్లిగా, అత్తగా, అక్కగా ఏ పాత్ర అయినా చేస్తాను. హీరోయిన్ గా అయితే ఇంకా మంచిది” అని చెప్పుకొచ్చింది. సినిమా అకాశాలు వచ్చినప్పటికీ అప్పట్లో కొన్ని కారణాలతో సినిమాలు చేయకూడదని భావించినట్లు రాశీ వెల్లడించింది. ఇష్టం లేకపోయినా, కొన్ని పాత్రలు చేయాల్సి వచ్చిందన్నారు. “కొన్నిసార్లు నచ్చకపోయినా చేసిన సినిమాలు ఉన్నాయి. మేకప్ వేసుకున్న తర్వాత సెట్ నుంచి రాశి వచ్చేసింది అనే పేరు రాకూడదనే అలా చేశాను. నేను వృత్తికి ఎంతో గౌరవం ఇస్తాను. ‘శుభాకాంక్షలు’ సినిమాలో నన్ను చూసి చాలా మంది తిట్టుకున్నారు. అంతేకాదు, నాకు పెద్ద అభిమానిగా ఉన్న ఒకావిడ సినిమాకు వెళ్లింది. ఈ సినిమా చూస్తుండగానే ఆమెకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఆ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. నేను చాలా బాధపడ్డాను. నా వల్ల ఓ వ్యక్తి నవ్వాలి. అంతేతప్ప, ఇబ్బంది పడకూడదు అనుకున్నాను. అప్పుడే సినిమాల నుంచి దూరం కావాలి అనుకున్నాను” అని వివరించింది. ప్రస్తుతం మళ్లీ అవకాశాలు వస్తున్నట్లు చెప్పింది. నటిగా చక్కటి గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>