PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amitshah-naidu-bjp-tdp98bd8152-4515-4cd2-8cf4-2e6a7ccf22d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amitshah-naidu-bjp-tdp98bd8152-4515-4cd2-8cf4-2e6a7ccf22d9-415x250-IndiaHerald.jpgఇక్కడ అమిత్ షా చెప్పిందాంట్లో రెండు యాంగిల్సున్నాయి. మొదటిదేమో ఎన్నికల్లో గెలవలేమన్న భయంతో చంద్రబాబు తనంతట తానుగానే బీజేపీతో పొత్తుపెట్టుకున్నారని. రెండో యాంగిల్ ఏమిటంటే పొత్తు కోసం తాము చంద్రబాబును ఎప్పుడూ పిలవలేదని. మొదటిపాయింటేమో చంద్రబాబు పరిస్ధితిని అమిత్ షా బహిరంగంగా ప్రకటించి గాలి తీసేసినట్లయ్యింది. ఇక రెండోదేమో చంద్రబాబుతో పొత్తు తమకు ఏమాత్రం అవసరంలేదని. amitshah naidu bjp tdp{#}Amith Shah;Hanu Raghavapudi;TDP;Bharatiya Janata Party;media;Minister;Air;CBNఅమరావతి : చంద్రబాబు గాలితీసేసిన అమిత్ షాఅమరావతి : చంద్రబాబు గాలితీసేసిన అమిత్ షాamitshah naidu bjp tdp{#}Amith Shah;Hanu Raghavapudi;TDP;Bharatiya Janata Party;media;Minister;Air;CBNSun, 17 Mar 2024 07:00:00 GMT

నిండుసభలో అంటే ప్రముఖ మీడియా సంస్ధ ఇడియా టుడే నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గాలి తీసేశారు. దేశరాజకీయాల గురించి యాంకర్ మాట్లాడుతు బీజేపీ పొత్తుల ప్రస్తావన తెచ్చారు. జాతీయస్ధాయిలో బీజేపీ బలపడేందుకు ప్రాంతీయపార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. పొత్తులను ఏపీలో టీడీపీపై ప్రశ్నవేశారు.




ఎన్డీయేలో నుండి వెళ్ళిపోయిన తర్వాత నరేంద్రదమోడీని చంద్రబాబు హార్డ్ కోర్ టెర్రరిస్టు అని ఆరోపించిన తర్వాత కూడా పొత్తు ఎలాగ పెట్టుకున్నారని సూటిగా నిలదీశారు. దానికి అమిత్ షా కూడా అంతేసూటిగా సమాధానం చెబుతు ఎన్డీయేలో నుండి వెళ్ళిపొమ్మని తాము ఎవరినీ పంపేయలేదన్నారు. అలాగే చంద్రబాబు కూడా 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయేలో నుండి వెళ్ళిపోయి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ పొత్తు కోసం వచ్చినట్లు చెప్పారు. తనంతట తానే చంద్రబాబు వచ్చారు కాబట్టి టీడీపీని ఎన్డీయేలో చేర్చుకున్నట్లు స్పష్టంగా చెప్పారు.





ఇక్కడ అమిత్ షా చెప్పిందాంట్లో రెండు యాంగిల్సున్నాయి. మొదటిదేమో ఎన్నికల్లో గెలవలేమన్న భయంతో చంద్రబాబు తనంతట తానుగానే బీజేపీతో పొత్తుపెట్టుకున్నారని. రెండో యాంగిల్ ఏమిటంటే పొత్తు కోసం తాము చంద్రబాబును ఎప్పుడూ పిలవలేదని. మొదటిపాయింటేమో చంద్రబాబు పరిస్ధితిని అమిత్ షా బహిరంగంగా ప్రకటించి గాలి తీసేసినట్లయ్యింది. ఇక రెండోదేమో చంద్రబాబుతో పొత్తు తమకు ఏమాత్రం అవసరంలేదని.





ఎన్డీయేలో నుండి తనంతట తానుగానే వెళ్ళిపోయిన చంద్రబాబు తిరిగి తనంతట తానుగానే వస్తానని అడిగితే తాము సరే అన్నామని చెప్పారు. ఈ విషయం ముఖ్యంగా ఎల్లోమీడియాకు చెప్పినట్లుగా ఉంది. ఎందుకంటే మొదటినుండి  ఎల్లోమీడియానే చంద్రబాబుతో పొత్తుకు ప్రయత్నించిందని, పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకే ఎక్కువగా ఉందని ఒకటే ఊదరగొడుతోంది. దానికి జవాబుగానా అన్నట్లు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేనేలేదని అమిత్ షా తేల్చి చెప్పేసినట్లయ్యింది. 7






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>