EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdpbdb83e26-7615-4dc1-9e17-6e9b08d42092-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdpbdb83e26-7615-4dc1-9e17-6e9b08d42092-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీ లో ఆ పార్టీ ప్రకటించిన రెండో జాబితా చిచ్చు రేపింది. ఈ జాబితాలోను సీనియర్లకు చోటు దక్కలేదు. దీంతో అసంతృప్తి భగ్గుమంది. 34మంది అభ్యర్థుల పేర్లతో విడుదలైన రెండో జాబితాలో సీనియర్ల పేర్లు లేవు. దీంతో తమ దారి తాము చూసుకుంటామని వారంతా అంటున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటుంటే.. కొందరు తమ అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కి రెండో జాబితాలో చోటు దక్కలేదు. ఆయన్ను మంత్రి బొత్స సత్యనారాయణపై పtdp{#}East;krishna district;Babji;Bheemili;Vishakapatnam;prasad;MLA;TDP;Kothapalli Samuel Jawahar;Party;CBN;District;Ministerతెలుగుదేశంలో చంద్రబాబు పెట్టిన సీట్లలో రచ్చ?తెలుగుదేశంలో చంద్రబాబు పెట్టిన సీట్లలో రచ్చ?tdp{#}East;krishna district;Babji;Bheemili;Vishakapatnam;prasad;MLA;TDP;Kothapalli Samuel Jawahar;Party;CBN;District;MinisterSun, 17 Mar 2024 07:53:04 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీ లో ఆ పార్టీ ప్రకటించిన రెండో జాబితా చిచ్చు రేపింది. ఈ జాబితాలోను సీనియర్లకు చోటు దక్కలేదు. దీంతో అసంతృప్తి భగ్గుమంది. 34మంది అభ్యర్థుల పేర్లతో విడుదలైన రెండో జాబితాలో సీనియర్ల పేర్లు లేవు. దీంతో తమ దారి తాము చూసుకుంటామని వారంతా అంటున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటుంటే.. కొందరు తమ అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు.


ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కి రెండో జాబితాలో చోటు దక్కలేదు. ఆయన్ను మంత్రి బొత్స సత్యనారాయణపై  పోటీ చేయాలని చంద్రబాబు సూచించాచు. దీనికి గంటా ససేమిరా అన్నారు. ఆయన భీమిలి టికెట్ ఆశిస్తున్నారు. అది కూడా ఇచ్చేందుకు అధిష్ఠానం అనుకూలంగా లేదు. దీంతో ఆయన తన అనుచరులతో రహస్యంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ మారాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏ క్షణంలో అయినా గంటా టీడీపీకీ షాక్ ఇస్తారని తెలుస్తోంది.


మరో సీనియర్ నేత మాజీ మంత్రి జవహర్ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు అక్కడ ముప్పిడి వెంకటేశ్వరరావుకి ఛాన్స్ ఇచ్చారు. దీంతో జవహర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక విశాఖ సౌత్ నుంచి గండి బాబ్జి టికెట్ ఆశించారు. కానీ ఆ స్థానం జనసేనకు వెళ్లడంతో ఆయన పార్టీని వీడారు.


కృష్ణా జిల్లా పెనమలూరు టికెట్ ను మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆశించారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ప్రసాద్ అనుచరులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఇక సర్వేపల్లి టికెట్ సోమిరెడ్డి కి ఇంకా ఖరారు కాలేదు. ఆయనకు హ్యాండ్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.  మొత్తానకి సెకండ్ లిస్ట్ లో టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. మూడో లిస్ట్ కూడా విడుదలైతే టీడీపీ లో అసంతృప్త జ్వాలలు మరింత రగిలే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>