Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlia4158084-133a-45c0-8f2c-dd518320b00c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlia4158084-133a-45c0-8f2c-dd518320b00c-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో జరుగుతున్న ఒక చర్చ విరాట్ కోహ్లీ అభిమానులు అందరిని కూడా ఆందోళనకు గురిచేస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కూడా సత్తా చాటుతూ అదరగొడుతూ ఉన్నాడు. దీంతో కోహ్లీ లేని టీం ఇండియాను అట అభిమానులకు అస్సలు ఊహించుకోలేరు అన్న విషయం తెలిసిందే. అలాంటిది జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో కోహ్లీని పక్కన పెట్టబోతున్నారు అంటూ ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వార్త నేపథ్యంలో ప్రస్తుతKohli{#}srikanth;World Cup;June;VIRAT KOHLI;ICC T20;News;BCCI;Cricketపని పాట లేదా.. కోహ్లీపై ఇలాంటి వార్తలేంటి : శ్రీకాంత్పని పాట లేదా.. కోహ్లీపై ఇలాంటి వార్తలేంటి : శ్రీకాంత్Kohli{#}srikanth;World Cup;June;VIRAT KOHLI;ICC T20;News;BCCI;CricketSun, 17 Mar 2024 16:00:00 GMTగత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో జరుగుతున్న ఒక చర్చ విరాట్ కోహ్లీ అభిమానులు అందరిని కూడా ఆందోళనకు గురిచేస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు.  మూడు ఫార్మాట్లలో కూడా సత్తా చాటుతూ అదరగొడుతూ ఉన్నాడు. దీంతో కోహ్లీ లేని టీం ఇండియాను అట అభిమానులకు అస్సలు ఊహించుకోలేరు అన్న విషయం తెలిసిందే. అలాంటిది జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో కోహ్లీని పక్కన పెట్టబోతున్నారు అంటూ ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఇక ఈ వార్త నేపథ్యంలో ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. నిజంగానే విరాట్ కోహ్లీని ఇలా పక్కన పెట్టబోతున్నారా.. అనే విషయంపై ప్రస్తుతం అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఇలా కోహ్లీని t20 వరల్డ్ నుండి బీసీసీఐ తప్పించబోతుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు..


 జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు గెలవాలి అంటే జట్టులో తప్పకుండా విరాట్ కోహ్లీ ఉండాల్సిందే అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. టి20 వరల్డ్ కప్ లో భారత జట్టును సెమీఫైనల్కు చేర్చింది విరాట్ కోహ్లీనే. అతను జట్టులో ఉండడని చెప్పింది ఎవరు? ఈ రూమర్స్ క్రియేట్ చేసేవారికి వేరే పనేం లేదా? ఇలా ఏం ఆధారంగా చేసుకొని ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారు? అంటూ ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు. అయితే బీసీసీఐ మాత్రం దీనిపై స్పందించకపోవడంతో.. కోహ్లీని తప్పించడం  నిజమా అబద్ధమో తెలియక అటు అభిమానులు అందరూ మరింత ఆందోళనలో మునిగిపోతున్నారు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>