EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/purandeswaria8308acf-0dfb-4fd4-ba23-771aee0c2571-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/purandeswaria8308acf-0dfb-4fd4-ba23-771aee0c2571-415x250-IndiaHerald.jpgఏపీలో పొత్తుల ప్రహసనం ముగిసింది. ఇప్పటి వరకు సాగిన అంచనాలకు ఫుల్ స్టాప్ పడింది. లెక్కలు ఫైనల్ అయ్యాయి. అంతేకాదు.. లెక్కలకు అనుగుణంగా ఏ పార్టీ ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై కూడా ఓ స్పష్టతకు వచ్చేశారు. అసెంబ్లీ సీట్లను పక్కన పెడితే బీజేపీ కోరకున్న ఆరు లోక్ సభ స్థానాలకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చినట్టే అనిపిస్తోంది. అయితే బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి బీజేపీ 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే ఆశావహుల జాబితpurandeswari{#}Somu Veerraju;Hindupuram;Pawan Kalyan;YCP;TDP;MP;Assembly;Bharatiya Janata Party;Party;Newsబీజేపీలో బద్‌నామ్‌ అవుతున్న పురందేశ్వరి?బీజేపీలో బద్‌నామ్‌ అవుతున్న పురందేశ్వరి?purandeswari{#}Somu Veerraju;Hindupuram;Pawan Kalyan;YCP;TDP;MP;Assembly;Bharatiya Janata Party;Party;NewsSun, 17 Mar 2024 08:00:00 GMTఏపీలో పొత్తుల ప్రహసనం ముగిసింది.  ఇప్పటి వరకు సాగిన అంచనాలకు ఫుల్ స్టాప్ పడింది. లెక్కలు ఫైనల్ అయ్యాయి. అంతేకాదు.. లెక్కలకు అనుగుణంగా ఏ పార్టీ ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై కూడా ఓ స్పష్టతకు వచ్చేశారు.  అసెంబ్లీ సీట్లను పక్కన పెడితే బీజేపీ కోరకున్న ఆరు లోక్ సభ స్థానాలకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చినట్టే అనిపిస్తోంది.


అయితే బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి బీజేపీ 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే ఆశావహుల జాబితాను రూపొందించమని సోము వీర్రాజు, పురంధేశ్వరి, రత్నాకర్ జీలకు అధిష్ఠానం సూచన చేసింది. దీంతో వారు ఎన్నో వ్యయప్రయాసలు పడి ఓ జాబితాను రూపొందించారు. తీరా చూస్తే.. హైకమాండ్ టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించింది.


మరీ పొత్తుల వ్యవహారంపై పురంధేశ్వరి కి సమాచారం ఉందో లేదో స్పష్టత లేదు. ఒకవేళ ఉంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో సమావేశం అయినప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈమెను కూడా చర్చలకు పిలిచేవారు. ఆ తర్వాత సీట్ల విషయాన్ని తేల్చేందుకు రాష్ట్రానికి కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తో పాటు ఓ ఎంపీ వచ్చారు.  సీట్ల గురించి చర్చించారు. లిస్ట్ ను ఫైనల్ చేశారు. ప్రకటించేశారు. ఇక్కడ కూడా పురంధేశ్వరి రాలేదు. బీజేపీ హైకమాండ్ దూతలతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లే చర్చలో పాల్గొన్నారు.


రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి సోము వీర్రాజు కానీ.. పురంధేశ్వరి కానీ హాజరు కాలేదు. మరోవైపు  హిందూపురం లాంటి చోట్ల విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్, స్వామీజీ లాంటి  నేతలు పోటీ పడుతున్నారు. కానీ ఇలాంటి చోట్ల కాదని.. ఇప్పటి వరకు టీడీపీ గెలవని.. వైసీపీ బలంగా ఉన్న స్థానాలను బీజేపీకి కేటాయించారు. దీంతో సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరంతా పురంధేశ్వరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం ఈ నిర్ణయాలు అన్నీ అధిష్ఠానం తీసుకుంటే మధ్యలో పురంధేశ్వరి బద్నాం అవుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>