Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl31631306-11d3-4284-91ec-2c61b6629219-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl31631306-11d3-4284-91ec-2c61b6629219-415x250-IndiaHerald.jpgఅప్పుడెప్పుడో 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఇక ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ పోరులో సత్తా చాట లేకపోయింది. అయితే గతంలో జట్టులో కీలక ప్లేయర్లుగా వ్యవహరించిన వారు.. ఇక ఇప్పుడు జట్టులో లేకపోవడం ఎప్పటికప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్ళను ఇక ఆ ఫ్రాంచైజీ మార్చుతూ ఉండడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది అని ఎన్నో రోజులుగా అటు విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్లోIpl{#}Australia;Hyderabadకమిన్స్ చేతికి సన్రైజర్స్ కెప్టెన్సీ.. స్మిత్ ఏమన్నాడో తెలుసా?కమిన్స్ చేతికి సన్రైజర్స్ కెప్టెన్సీ.. స్మిత్ ఏమన్నాడో తెలుసా?Ipl{#}Australia;HyderabadSun, 17 Mar 2024 14:15:00 GMTఅప్పుడెప్పుడో 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఇక ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ పోరులో సత్తా చాట లేకపోయింది. అయితే గతంలో జట్టులో కీలక ప్లేయర్లుగా వ్యవహరించిన వారు.. ఇక ఇప్పుడు జట్టులో లేకపోవడం ఎప్పటికప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్ళను ఇక ఆ ఫ్రాంచైజీ మార్చుతూ ఉండడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది అని ఎన్నో రోజులుగా అటు విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి.



 అయితే ప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్లో కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తీవ్రంగా నిరాశ పరుస్తుంది. లీగ్ దశ మ్యాచ్లలో అటు ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేక అభిమానులు అందరినీ కూడా నిరాశలో ముంచేస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట తీరిపై విమర్శలు వస్తూ ఉండగా.. ఇక 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఆ జట్టు యాజమాన్యం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో 20.5 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ చేతిలో సారధ్య బాధ్యతలను పెట్టింది సన్రైజర్స్ జట్టు యాజమాన్యం.



 ఈ క్రమంలోనే అతని సారధ్యంలో భారత జట్టు ఎలా రాణిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలీ. కాగా సన్రైజర్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఫ్యాట్ కమిన్స్ కు అప్పగించడంపై ఆస్ట్రేలియా ప్లేయర్స్ స్మిత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సన్రైజర్స్ కెప్టెన్ గా కమిన్స్ రాణిస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేశాడు. హైదరాబాద్ హెడ్ కోచ్ వెటోరి ఆస్ట్రేలియా టీంకు అసిస్టెంట్ కోచ్ కూడా. ఆయనతో కమిన్స్ కు చక్కటి అనుబంధం ఉంది. పైగా కెప్టెన్సీ బాధ్యత ఉన్న ప్రతిసారి అతను అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తాడు. ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ రాణిస్తుంది అనే నమ్మకం ఉంది అంటూ స్మిత్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>