PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/naidu-bjp-modi5ed2bd7a-3204-4a6f-b8c1-8f12a395e1eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/naidu-bjp-modi5ed2bd7a-3204-4a6f-b8c1-8f12a395e1eb-415x250-IndiaHerald.jpgఇప్పుడు వీళ్ళ బాధేమిటంటే బీజేపీకి బలంలేని సీట్లను కేటాయించటమే కాకుండా పోటీచేయాలని అనుకుంటున్న సీట్లలో టీడీపీ అభ్యర్ధులను ప్రకటించేశారట. అసలు టీడీపీ పోటీచేయబోయే సీట్లను చంద్రబాబు నిర్ణయించటం ఏమిటన్నది వీళ్ళ అభ్యంతరం. చోడవరం, మాడుగుల సీట్లను బీజేపీ కోరుతుంటే చంద్రబాబు తన అభ్యర్ధులను ప్రకటించేశారు. విజయవాడ సెంట్రల్ కావాలని అడుగుతుంటే వెస్ట్ నియోజకవర్గం ఇచ్చారట.naidu bjp modi{#}Vijayawada;Bojjala Gopala Krishna Reddy;narasaraopet;Rajahmundry;Guntur;CBN;TDP;Yevaru;anand malayalam actor;Anand Deverakonda;Party;Bharatiya Janata Partyఅమరావతి : చంద్రబాబు బీజేపీకి వెన్నుపోటు పడిచారా ?అమరావతి : చంద్రబాబు బీజేపీకి వెన్నుపోటు పడిచారా ?naidu bjp modi{#}Vijayawada;Bojjala Gopala Krishna Reddy;narasaraopet;Rajahmundry;Guntur;CBN;TDP;Yevaru;anand malayalam actor;Anand Deverakonda;Party;Bharatiya Janata PartySun, 17 Mar 2024 09:00:00 GMT

చంద్రబాబునాయుడు దెబ్బకు బీజేపీ నేతలు మరోసారి  విలవిల్లాడిపోతున్నారట. రెండోజాబితాలో 34 మంది అభ్యర్ధులను చంద్రబాబు  ప్రకటించటంపై కమలనాదులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. తమకిస్తామన్న సీట్లలో టీడీపీ అభ్యర్ధులను ప్రకటించటం ఏమిటంటు మండిపోతున్నారు. ఇదే విషయాన్ని 16 మంది సీనియర్ నేతలు ఢిల్లీలోని అగ్రనేతలకు ఫిర్యాదుచేశారు.  రెండు దశాబ్దాలుగా టీడీపీనే గెలవని అనపర్తి, జమ్మలమడుగు, బద్వేలు, విజయవాడ వెస్ట్, ఆధోని లాంటి సీట్లన్నింటినీ బీజేపీకి కట్టబెట్టారని కమలనాదులు గుర్రుమంటున్నారు. అలాగే మదనపల్లి, శ్రీకాళహస్తి, గుంటూరు పశ్చిమం సీట్లలో బీజేపీ పోటీచేయాలని పట్టుదలగా ఉంటే చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించేశారని ఫిర్యాదుచేశారు. 





ఇప్పుడు వీళ్ళ బాధేమిటంటే బీజేపీకి బలంలేని సీట్లను కేటాయించటమే కాకుండా పోటీచేయాలని అనుకుంటున్న  సీట్లలో టీడీపీ అభ్యర్ధులను ప్రకటించేశారట.  అసలు టీడీపీ పోటీచేయబోయే సీట్లను చంద్రబాబు నిర్ణయించటం ఏమిటన్నది వీళ్ళ అభ్యంతరం.  చోడవరం, మాడుగుల సీట్లను బీజేపీ కోరుతుంటే చంద్రబాబు తన అభ్యర్ధులను ప్రకటించేశారు. విజయవాడ సెంట్రల్ కావాలని అడుగుతుంటే వెస్ట్ నియోజకవర్గం ఇచ్చారట.





సోమువీర్రాజు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే సడెన్ గా కైకలూరులో పోటీ చేయబోతున్నారని అంటున్నారు. కైకలూరులో బీజేపీకి బలమేలేదు. అలాగే శ్రీకాళహస్తిలో కోలా ఆనందును పోటీచేయమని అగ్రనేతలు చెప్పారు. దాంతో కొంతకాలంగా ఆనంద్ నియోజకవర్గంలో బాగా ప్రచారం చేసుకుంటున్నారు. సడెన్ గా gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డిని అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటించేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ అధికార ప్రతినిధి వల్లూరు జయ్ ప్రకాష్ పోటీకి రెడీ అయిపోయారు. ఇంటింటికి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఈ సమయంలో పిడుగురాళ్ళ మాధవిని అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటించారు.





మదనపల్లిలో పోటీకి బీజేపీ రెడీ అవుతుంటే షాజహాన్ భాషాను టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించేశారు. చంద్రబాబు-గజేంద్రసింగ్ షెకావత్ మధ్య జరిగిన సీట్ల ఒప్పందానికి భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. చర్చల్లో ఇస్తామన్న సీట్లకు బదులు ప్రత్యామ్నాయంగా వేరే సీట్లను చూపిస్తున్నారంటు చంద్రబాబు మీద మండిపోతున్నారు. నరసరావుపేట ఎంపీగా బీజేపీ నేత శ్రీనివాసవర్మ ప్రయత్నిస్తుంటే చంద్రబాబేమో రఘురామకృష్ణంరాజును ప్రతిపాదిస్తున్నారట.  బీజేపీ నుండి ఎవరు పోటీచేయాలో చంద్రబాబుకు దేనికంటు కమలనాదులు మండిపోతున్నారు.  మొత్తానికి చంద్రబాబు దెబ్బకు బీజేపీ నేతలు విలవిల్లాడిపోతున్నారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>