PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila--ys-sunitha586d151e-0120-4549-9817-b93a7abb73de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila--ys-sunitha586d151e-0120-4549-9817-b93a7abb73de-415x250-IndiaHerald.jpgవై ఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదు సంవత్సరాలు గడిచింది. అందులో భాగంగానే ఆయన కుమార్తె వైఎస్ సునీత రెడ్డి వారి కుటుంబంతో సన్నిహితంగా ఆత్మీయంగా ఉండే నేతలతో కడపలోని జయరామ గార్డెన్స్‌లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సునీత అక్క సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, పీసీసీ చీఫ్ షర్మిల కూడా హాజరవ్వడం జరిగింది. అంతేకాక తెలుగుదేశం, బీజేపీ ఇంకా కాంగ్రెస్ నేతలు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చి సునీతకు సానుభూతి తెలియజేసి వివేకానంద రెడ్డికి నివాళులు అర్పించారు. వైఎస్ వివేకానంద రెడ్డి కYS Sharmila - YS Sunitha{#}Bharatiya Janata Party;AdiNarayanaReddy;Y S Vivekananda Reddy;Yevaru;Sharmila;Congress;Murder.;CM;Reddyవివేకా కుమార్తె పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన షర్మిళ?వివేకా కుమార్తె పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన షర్మిళ?YS Sharmila - YS Sunitha{#}Bharatiya Janata Party;AdiNarayanaReddy;Y S Vivekananda Reddy;Yevaru;Sharmila;Congress;Murder.;CM;ReddySat, 16 Mar 2024 14:22:20 GMTవై ఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి  ఐదు సంవత్సరాలు గడిచింది. అందులో భాగంగానే ఆయన కుమార్తె వైఎస్ సునీత రెడ్డి వారి కుటుంబంతో సన్నిహితంగా ఆత్మీయంగా ఉండే నేతలతో కడపలోని జయరామ గార్డెన్స్‌లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సునీత అక్క సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, పీసీసీ చీఫ్ షర్మిల కూడా హాజరవ్వడం జరిగింది.  అంతేకాక తెలుగుదేశం, బీజేపీ ఇంకా కాంగ్రెస్ నేతలు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చి సునీతకు సానుభూతి తెలియజేసి వివేకానంద రెడ్డికి నివాళులు అర్పించారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబానికి అన్ని పార్టీల తరఫున అండదండలు ఉంటాయని వారు తెలిపారు.ముఖ్యంగా ఎవరైతే ఈ హత్య కేసులో నిందలు ఆరోపించబడ్డ ఆదినారాయణ రెడ్డి కూడా ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చి సునీతకి అండగా ఉంటామని చెప్పడం సంచలనంగా మారింది. సునీత రెడ్డి రాజకీయ జీవితంపై ఆలోచించి కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవాలని, దానికి పార్టీలకు అతీతంగా ఆమెకు తోడుగా ఉంటామని తెలిపారు.ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన కుటుంబ సభ్యులే తనను నిందితురాలిగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.


ఎవరు అండగా ఉన్నా లేకపోయినా సునీతకు అండగా నేను ఉంటానని షర్మిళ భరోసా ఇచ్చారు. ఆస్తి కోసమో లేదా అధికారం కోసమో ఈ మాటలు చెప్పడం లేదని, సునీతను చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టే తన బాధను అర్థం చేసుకున్నానన్నారు షర్మిళ. సునీతకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తన కుటుంబానికి మాట ఇస్తున్నానని వై ఎస్ షర్మిల భావోద్వేగంతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారు కోప్పడడమే ఇప్పటిదాకా నేను చూడలేదని, అలాంటిది ఆయనకి అంత క్రూరమైన చావు రావడం నిజంగా తట్టుకోలేకపోతున్నానని షర్మిల అన్నారు.ఇక తను రాజకీయాల్లోకి వస్తానా లేదా అనేది ముఖ్యం కాదని, కానీ ప్రజాక్షేత్రంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా అని వైఎస్ సునీత అన్నారు. వచ్చే ఎన్నికలలో మాత్రం తన అన్న వైఎస్ జగన్‌కు మాత్రం ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. అందువల్ల నాకు జ్యూడిషరీలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని సునీత అన్నారు. పోటీ చేస్తానా లేదా అనేదానిపై క్లారిటీ ఇవ్వలేకపోయారు సునీత రెడ్డి. అయితే సునీత పొలిటికల్ ఎంట్రీపై షర్మిల స్పందిస్తూ.. సునీత నాతోనే నా వెంటే ఉన్నారని త్వరలోనే క్లారిటీ ఇస్తానని స్పష్టం చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>