PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kavita-liquor-scam-ed8d81b718-a484-454b-ba77-4b6a1f0d0fd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kavita-liquor-scam-ed8d81b718-a484-454b-ba77-4b6a1f0d0fd2-415x250-IndiaHerald.jpgవిచారణలో ఉన్న కేసు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలీదు. కోర్టులో కేసు తేలేంతవరకు లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్టుచేసేందుకు లేదు. అందుకనే ఇంతకాలం వెయిట్ చేసిన ఈడీ సడెన్ గా ఐటి అధికారులతో కలిసి కవిత ఇంట్లో సోదాలకు దిగింది. ఒకవేళ ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలు ఏమైనా బయటపడితే వెంటనే కవితను అదుపులోకి తీసుకోవచ్చని వీళ్ళ ఉద్దేశ్యం అయ్యుండచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే లిక్కర్ స్కామ్ సుమారుగా ఏడాదిన్నరగా సాగుతోంది. ఇప్పటికి ఈ స్కామ్ లో చాలామందిని అరెస్టుచేసినా కవిత అరెస్టు మాత్రం జరగలేదkavita liquor scam ED{#}kavitha;Kalvakuntla Kavitha;Husband;court;Delhiహైదరాబాద్ : కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ ?హైదరాబాద్ : కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ ?kavita liquor scam ED{#}kavitha;Kalvakuntla Kavitha;Husband;court;DelhiSat, 16 Mar 2024 03:00:00 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కల్వకుంట్ల కవిత ఇంట్లో ఆదాయపుపన్ను, ఈడీ ఉన్నతాధికారులు సోదాలు చేశారు. కవిత ఇంట్లో సోదాలు చేయటం సంచలనమనే కాని ఏమి దొరికిందనే విషయంలో మాత్రం క్లారిటిలేదు. ఆమె ఇంటితో పాటు వ్యాపారాలు, భర్త అనీల్ వ్యాపారాలపైన కూడా ఏకకాలంలో పది బృందాలుగా విడిపోయిన ఉన్నతాధికారులు సోదాలు నిర్వహించారు. కొన్నిగంటల పాటు సోదాలు చేసిన తర్వాత ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించాల్సుంది.





నిజానికి ఈ సోదాల్లో ఏమి దొరకలేదని పార్టీవర్గాల సమాచారం. ఎందుకంటే ఆదయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలు, ప్రచారం కవితపై ఎప్పటినుండో జరుగుతున్నదే. దానికి క్లౌమ్యాక్స్ ఏమిటంటే ఢిల్లీ లిక్కర్  స్కామ్ లో ఆమె పాత్ర. ఈడీ ఇప్పటికే కవితను రెండురోజులు ఢిల్లీలోనే విచారించింది. తర్వాత విచారణకు రమ్మని ఎన్ని నోటీసులు ఇచ్చినా కవిత హాజరుకాలేదు. హాజరుకాకపోగా తనను విచారణకు ఆఫీసుకు పిలిపించకూడదని, తనపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలని కవిత సుప్రింకోర్టులో పిటీషన్లు కూడా వేశారు.





విచారణలో ఉన్న కేసు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలీదు. కోర్టులో కేసు తేలేంతవరకు లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్టుచేసేందుకు లేదు. అందుకనే ఇంతకాలం వెయిట్ చేసిన ఈడీ సడెన్ గా ఐటి అధికారులతో కలిసి కవిత ఇంట్లో సోదాలకు దిగింది. ఒకవేళ ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలు ఏమైనా బయటపడితే వెంటనే కవితను అదుపులోకి తీసుకోవచ్చని వీళ్ళ ఉద్దేశ్యం అయ్యుండచ్చు.   అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే లిక్కర్ స్కామ్ సుమారుగా ఏడాదిన్నరగా సాగుతోంది. ఇప్పటికి ఈ స్కామ్ లో చాలామందిని అరెస్టుచేసినా కవిత అరెస్టు మాత్రం జరగలేదు.





ఒకవేళ తన పాత్ర లిక్కర్ స్కామ్ లో ఉండుంటే దానికి సంబంధించిన సాక్ష్యాలను కవిత తనింట్లోనే పెట్టుకుని ఉంటారా ? కోర్టులో వేసిన ఛార్జిషీట్లు, రిమాండురిపోర్టులో కవిత పాత్ర చాలా కీలకమని ఈడీ చాలాసార్లు చెప్పింది నిజమే. కాని అందుకు ఆధారాలను ఏమి చూపిందనేది మాత్రం తెలీదు. నిజంగానే కవిత పాత్రుండుంటే కోర్టు తప్పకుండా యాక్షన్ తీసుకోమనే ఆదేశిస్తుందనటంలో సందేహంలేదు. మరి తాజా సోదాల్లో ఏమన్నా బయటపడుతుందేమో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>