Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec1caed8f-1ac0-43c5-87e7-01474d384ef4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec1caed8f-1ac0-43c5-87e7-01474d384ef4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఇంటిలో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హయవాహిని పెళ్లి మార్చి 15న (శుక్రవారం) హైదరాబాద్ సిటీలో జరుగుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ కూతురి వివాహం చాలా సైలెంట్ గా జరగడం.. ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.జనరల్ గా స్టార్ సెలబ్రెటీస్ తమ పిల్లలకు సంబంధించిన .. పెళ్లి వ్యవహారాల గురించి సోషల్ మీడియా వేదికగా ఎలా హంగామా చేస్తూ ఉంటారో మనకు తెలిసిందే. చిన్న ఫంక్షన్ అంటేనే నాన్న హంగామాsocialstars lifestyle{#}Namrata Shirodkar;mahesh babu;sithara;Girl;Hyderabad;Venkatesh;marriage;Father;media;Newsవెంకటేష్ కూతురు మెహంది వేడుకకు హాజరైన నమ్రత, సితార..!!వెంకటేష్ కూతురు మెహంది వేడుకకు హాజరైన నమ్రత, సితార..!!socialstars lifestyle{#}Namrata Shirodkar;mahesh babu;sithara;Girl;Hyderabad;Venkatesh;marriage;Father;media;NewsSat, 16 Mar 2024 18:00:00 GMTటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఇంటిలో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హయవాహిని పెళ్లి మార్చి 15న (శుక్రవారం) హైదరాబాద్ సిటీలో జరుగుతోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ కూతురి వివాహం చాలా సైలెంట్ గా జరగడం.. ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.జనరల్ గా స్టార్ సెలబ్రెటీస్ తమ పిల్లలకు సంబంధించిన .. పెళ్లి వ్యవహారాల గురించి సోషల్ మీడియా వేదికగా ఎలా హంగామా చేస్తూ ఉంటారో మనకు తెలిసిందే. చిన్న ఫంక్షన్ అంటేనే నాన్న హంగామా చేస్తారు . మరి అలాంటిది పెళ్లి ఫంక్షన్ అంటే ఎంత రచ్చరంబోలాగా ఉండాలి .
అయితే చాలా సింపుల్ గా చాలా సైలెంట్ గా వెంకటేష్ కూతురు మెహంది వేడుక జరగడం ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. చాలా తక్కువ మంది క్లోజ్ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యుల సమక్షంలో వెంకటేష్ కూతురు పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నిన్న నైట్ మెహందీ వేడుకలు చాలా సింపుల్ గా జరిగాయి . ఈ వేడుకకు మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి నమ్రత - సితార హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి .

నిశ్చితార్ధం వేడుకలు కూడా చాలా సైలెంట్ గా జరిపిన వెంకటేష్ ఇప్పుడు పెళ్లి వేడుకని అంతకంటే సింపుల్గా చేసేస్తున్నారు . దీనికి రీజన్ ఏంటా అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు . వెంకటేష్ కి మొత్తం ముగ్గురు కూతుర్లు .. ఒక అబ్బాయి వీళ్ళ పెద్దమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది . ఇప్పుడు జరగబోయేది రెండో అమ్మాయి పెళ్లి. అయితే వెంకటేష్ తన ఫ్యామిలీ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు అని .. మొదటి నుంచి ఆయనది అదే తంతు అని అందుకే ఇలా సింపుల్గా తన కూతురికి పెళ్లి జరుపుతున్నాడు అని ప్రచారం జరుగుతుంది.నమ్రతతో పాటు కుమార్తె సితార ఘట్టమనేని సైతం హయవాహిని మెహందీ వేడుకలో సందడి చేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. సితార స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>