PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ema-kadha-a-political-powerhousee5c8a7b5-a612-425b-b415-da4e9b23bed2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ema-kadha-a-political-powerhousee5c8a7b5-a612-425b-b415-da4e9b23bed2-415x250-IndiaHerald.jpgసృష్టించిన సంపద ద్వారానే సంక్షేమపథకాలు అమలుచేసి, ప్రపంచ ప్రఖ్యాత కలల రాజధాని అమరావతిని నిర్మించుండచ్చు. లక్షల కోట్లరూపాయలు అప్పులు చేశారు. ఎన్నికల హామీలైన సంక్షేమపథకాలూ అమలుచేయలేదు. అమరావతినీ కట్టలేదు. మరి సృష్టించిన సంపదనంతా చంద్రబాబు ఏమిచేశారు ? ఆ విషయాలను అప్పట్లో చంద్రబాబును పవన్ ఎందుకు నిలదీయలేదు ? పైగా కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి+సంక్షేమాన్ని అమలుచేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. janasena pawan modi chandrababu{#}sampada;Capital;Reddy;Jagan;CBN;Partyఅమరావతి : అన్నీ తప్పుడు హామీలేనా ?అమరావతి : అన్నీ తప్పుడు హామీలేనా ?janasena pawan modi chandrababu{#}sampada;Capital;Reddy;Jagan;CBN;PartySat, 16 Mar 2024 09:00:00 GMT


జనసేన అధినేత తప్పుడు హామీలతో జనాలను మోసంచేయటానికి రెడీ అయిపోయారు. పార్టీ ఆఫీసులో మాట్లాడుతు ఐదేళ్ళు అధికారం అనుభవించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయకుండానే రెండోసారి అధికారం ఇవ్వాలని అడుగుతున్నారట. తాను మాత్రం ఐదేళ్ళలో చాలాచేసి కూటమికి ఓట్లేసి గెలిపించమని అడుగుతున్నట్లు చెప్పారు.  అధికారంలో ఉన్నది జగన్ అయితే పవన్ ఐదేళ్ళల్లో జనాలకు ఏమిచేశారో అర్ధంకావటంలేదు. కూటమి అధికారంలోకి వచ్చినతర్వాత  అప్పులు చేయకుండానే సంపద సృష్టిస్తుందట.  సంపద సృష్టించటం ద్వారా సంక్షేమపథకాలను అమలుచేస్తుందట. అప్పులు చేయమని చెప్పటమే పెద్ద అబద్ధం.




సంపదను సృష్టించటం అంటే ఏమిటో మాత్రం పవన్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే సంపద సృష్టి అన్న విషయం తనకే తెలియదుకాబట్టి. సంపదసృష్టి అన్నది చంద్రబాబునాయుడు ఊతపదం. తాను అధికారంలో ఉన్నపుడు ఎప్పుడూ సంపదసృష్టి అన్న విషయాన్ని మాట్లాడలేదు. ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోగానే సంపదసృష్టి అంటు గోల మొదలుపెట్టారు. ఇపుడా సంపదృష్టి అన్న బ్రహ్మపదార్ధాన్ని పవన్ కూడా పట్టుకున్నారు. నిజంగానే చంద్రబాబుకు సంపదసృష్టించేత సీనుంటే అధికారంలో ఉన్న ఐదేళ్ళు అప్పులుచేయకుండానే సంపదసృష్టించి ఉండవచ్చు కదా.





సృష్టించిన సంపద ద్వారానే సంక్షేమపథకాలు అమలుచేసి, ప్రపంచ ప్రఖ్యాత కలల రాజధాని అమరావతిని నిర్మించుండచ్చు. లక్షల కోట్లరూపాయలు అప్పులు చేశారు. ఎన్నికల హామీలైన సంక్షేమపథకాలూ అమలుచేయలేదు. అమరావతినీ కట్టలేదు. మరి సృష్టించిన సంపదనంతా చంద్రబాబు ఏమిచేశారు ? ఆ విషయాలను అప్పట్లో చంద్రబాబును పవన్ ఎందుకు నిలదీయలేదు ? పైగా కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి+సంక్షేమాన్ని అమలుచేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.





ఇలాంటి హామీనే 2014 ఎన్నికల్లో కూడా ఇచ్చారు. ఇచ్చిన హామీలను అమలుచేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. హామీలను అమలుచేయకపోతే చొక్కాపట్టుకుంటానని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏమిచేశారో, పవన్ ఏమి చేశారో అందరూ చూసిందే. మొత్తానికి కూటమిని అధికారంలోకి తీసుకురావటం కోసం పవన్ కూడా తప్పుడు హామీలు మొదలుపెట్టేశారు. కూటమి అధికారంలోకి వస్తే హామీల అములుకు ఇటు చంద్రబాబును అటు ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీసేంత సీన్ పవన్లో లేదని అందరికీ తెలుసు. పోటీచేయబోయే సీట్లను తగ్గించుకోవటం కూడా ప్రజల కోసం తాను చేసిన త్యాగంగా చెప్పుకోవటం పవన్ కే చెల్లింది. మరి పవన్ హామీలను, మాటలను జనాలు నమ్ముతారా ?





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>