Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywoodaeb16956-a199-4041-af59-df1bfc33c981-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywoodaeb16956-a199-4041-af59-df1bfc33c981-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు అంటే చాలు వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక భారీగా పారితోషకం తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అప్పటివరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన వారు కూడా లగ్జరీ లైఫ్ను గడపడం చేస్తూ ఉంటారు అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ ఎంతో అందంగా కనిపించే రంగుల ప్రపంచంలో చితికిపోయిన జీవితాలు ఎన్నో ఉంటాయి అని అప్పుడప్పుడు తెర మీదకి వచ్చే ఘటనల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉBollywood{#}Cycle;Audience;Cinema;bollywood;Yevaruఇంటి రెంట్ కట్టలేని దీనస్థితిలో.. స్టార్ డైరెక్టర్?ఇంటి రెంట్ కట్టలేని దీనస్థితిలో.. స్టార్ డైరెక్టర్?Bollywood{#}Cycle;Audience;Cinema;bollywood;YevaruSat, 16 Mar 2024 09:05:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు అంటే చాలు వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక భారీగా పారితోషకం తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అప్పటివరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన వారు కూడా లగ్జరీ లైఫ్ను గడపడం చేస్తూ ఉంటారు అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు.


 కానీ ఎంతో అందంగా కనిపించే రంగుల ప్రపంచంలో చితికిపోయిన జీవితాలు ఎన్నో ఉంటాయి అని అప్పుడప్పుడు తెర మీదకి వచ్చే ఘటనల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది. సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకొని.. ఎన్నో అవార్డులను  సొంతం చేసుకున్న వారు సైతం కొన్ని కొన్ని సార్లు దుర్భర జీవితాన్ని గడిపే పరిస్థితుల్లోకి వస్తూ ఉంటారు అని వెలుగులోకి వచ్చే విషయాల ద్వారా అందరూ తెలుసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక బాలీవుడ్ డైరెక్టర్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయిందట. కనీసం ఇంటి రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేని దుర్భరస్థితిలో గడుపుతున్నాడట ఆ బాలీవుడ్ డైరెక్టర్.


 ఆయన ఎవరో కాదు.. జోరమ్ మూవీ డైరెక్టర్ అయిన దేవాశిష్ మకీజ. ఇటీవల  తన దీనస్థితిని బయట పెట్టారు ఆయన. 40 ఏళ్ళ తాను సైకిల్ కొనే స్థాయిలో కూడా లేను అంటూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. కలనే నమ్ముకుని ఆరు నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేని దారిద్యంలోకి వెళ్లిపోయాను అంటూ తెలిపాడు. తన వద్ద 20 స్క్రిప్టులు ఉన్నాయని.. కానీ నిర్మాతలు ఎవరు కూడా ముందుకు రావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు ఈ స్టార్ డైరెక్టర్. అయితే దేవాశిష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జోరమ్ మూవీ అటు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్ట్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇలా అవార్డులు వచ్చాయి. కానీ ఆర్థికంగా మాత్రం అతనికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. గతంలో ఈయన దర్శకత్వంలో దొరికేక్కిన మజ్జి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>