PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-mudragada-pawan271dc8b2-42f4-482a-ac32-a51d2c96f032-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-mudragada-pawan271dc8b2-42f4-482a-ac32-a51d2c96f032-415x250-IndiaHerald.jpgఅయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముద్రగడను భరించటం అంత వీజీకాదు. ప్రతి చిన్న విషయానికి పెద్దగా రియాక్టవుతారు. ఎప్పుడూ జేబులో రాజీనామా లేఖ పెట్టుకుని తిరుగుతుంటారు. ఈయనకు ఎవరితోను పడదు కాబట్టి ఏ పార్టీలో కూడా ఎక్కువకాలం ఇమడలేరు. అయినదానికి కానిదానికి నానా గోలచేస్తుంటారు. ఈయన ఏ పార్టీలో ఉన్నా ప్రత్యర్ధిపార్టీల నేతలకు ప్రతిరోజు పండుగే. నిజానికి ముద్రగడను పార్టీలోకి తీసుకోవద్దని చాలామంది నేతలు జగన్ కు చెప్పారు. అయితే ఏమైందో ఏమో ఇపుడు ముద్రగడ పార్టీలో చేరారు. jagan mudragada pawan{#}రాజీనామా;kakinada;Mudragada Padmanabham;srinivas;pithapuram;Janasena;YCP;CBN;Jagan;District;Pawan Kalyan;Partyగోదావరి : కొత్త తలనొప్పిని తెచ్చుకున్నారా ?గోదావరి : కొత్త తలనొప్పిని తెచ్చుకున్నారా ?jagan mudragada pawan{#}రాజీనామా;kakinada;Mudragada Padmanabham;srinivas;pithapuram;Janasena;YCP;CBN;Jagan;District;Pawan Kalyan;PartySat, 16 Mar 2024 05:00:00 GMT

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తన కొడుకు గిరి, మద్దతుదారలతో పాటు జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీలో చేరి కాకినాడ పార్లమెంటుకు లేదా పిఠాపురం అసెంబ్లీలో పోటీచేయాలని అప్పుడెప్పుడో అనుకున్నారు. అయితే తర్వాత పరిణామాల్లో  జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కలిసినపుడు ముద్రగడ జనసేనలో చేరాలని అనుకున్నారు.





తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానిస్తారని బొలిశెట్టి ప్రకటించారు. అయితే తెరవెనుక ఏమైందో ఏమో కాని పవన్ వెళ్ళలేదు ముద్రగడ జనసేనలో చేరలేదు. తాజా పరిణామాల్లో ముద్రగడ వైసీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో తాను పార్టీకి ప్రచారం మాత్రమే చేస్తానని ఎక్కడా పోటీచేయటంలేదని ముద్రగడే ప్రకటించారు. సో ముద్రగడ పోటీచేస్తారనే విషయమై క్లారిటి వచ్చేసింది.





అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముద్రగడను భరించటం అంత వీజీకాదు. ప్రతి చిన్న విషయానికి పెద్దగా రియాక్టవుతారు. ఎప్పుడూ జేబులో రాజీనామా లేఖ పెట్టుకుని తిరుగుతుంటారు. ఈయనకు ఎవరితోను పడదు కాబట్టి ఏ పార్టీలో కూడా ఎక్కువకాలం ఇమడలేరు. అయినదానికి కానిదానికి నానా గోలచేస్తుంటారు. ఈయన ఏ పార్టీలో ఉన్నా ప్రత్యర్ధిపార్టీల నేతలకు ప్రతిరోజు పండుగే. నిజానికి ముద్రగడను పార్టీలోకి తీసుకోవద్దని చాలామంది నేతలు జగన్ కు చెప్పారు. అయితే ఏమైందో ఏమో ఇపుడు ముద్రగడ పార్టీలో చేరారు.





వాస్తవానికి ముద్రగడకు పవన్ తో పాటు చంద్రబాబునాయుడుతో ఏమాత్రం పడదు. చంద్రబాబు హయాంలో ముద్రగడతో పాటు ఆయన కుటుంబం ఎంతటి వేధింపులకు గురయ్యిందో అందరికీ తెలిసిందే. కాబట్టి రేపటి ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా ముద్రగడ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ పోటీచేయబోతున్నారు. కాబట్టి ముద్రగడ పవన్ ఓటమికి ప్రత్యేకంగా దృష్టిపెడతారేమో చూడాలి. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో ముద్రగడ పోషించబోయే పాత్ర బాగా ఆసక్తిగా ఉండబోతోంది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>