Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb9edc96d-1326-47a0-9303-f49fd480ce60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb9edc96d-1326-47a0-9303-f49fd480ce60-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా 'చిరుత' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర' మూవీతో బాక్సాఫీస్ హిట్ కొట్టాడు. ఇప్పటి వరకు రామ్చరణ్ నటించిన సినిమాలు చాలా తక్కువే అయినా అన్నీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు లభిస్తుంది. రామ్ చరణ్ మాత్రం గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. జపాన్ లో ఇంకా ఈ మూవీ క్రేజsocialstars lifestyle{#}Venkatesh;Rajamouli;sukumar;Hyderabad;GEUM;Uttarandhra;Chitram;RRR Movie;Ram Charan Teja;Chiranjeevi;NTR;Blockbuster hit;Japan;Good news;Good Newwz;ram pothineni;Tollywood;Pooja Hegde;India;Director;Hero;Cinema;Press;March;Newsమెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ డేట్ ఫిక్స్ చేసిన రామ్ చరణ్..!!మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ డేట్ ఫిక్స్ చేసిన రామ్ చరణ్..!!socialstars lifestyle{#}Venkatesh;Rajamouli;sukumar;Hyderabad;GEUM;Uttarandhra;Chitram;RRR Movie;Ram Charan Teja;Chiranjeevi;NTR;Blockbuster hit;Japan;Good news;Good Newwz;ram pothineni;Tollywood;Pooja Hegde;India;Director;Hero;Cinema;Press;March;NewsSat, 16 Mar 2024 14:23:03 GMTమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా 'చిరుత' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర' మూవీతో బాక్సాఫీస్ హిట్ కొట్టాడు. ఇప్పటి వరకు రామ్చరణ్ నటించిన సినిమాలు చాలా తక్కువే అయినా అన్నీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు లభిస్తుంది. రామ్ చరణ్ మాత్రం గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. జపాన్ లో ఇంకా ఈ మూవీ క్రేజ్ తగ్గలేదు. వరుస హిట్స్ కొడుతూ వస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చాలా గ్యాప్ తీసుకొని స్టార్ డైరెక్టర్ శంకర్ తో 'గేమ్ చేంజర్' మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రారంభం నుంచే భారీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పూర్తి కాకుండానే రామ్ చరణ్ తన 16 వ మూవీ 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన తో చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తిగా స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గేమ్ చేంజర్ పూర్తి కాగా పట్టాలేక్కబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా రామ్ చరణ్ 16 వ మూవీ గురించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు.. అదే రోజు ఈ మూవీ షూటింగ్ ముహూర్తం మొదలు పెడతారని ఇప్పటి వరకు ప్రచారం జరుగుతుంది.

ఈ చిత్రం షూటింగ్ మార్చి 20నే ప్రారంభించబోతున్నట్లు ఇండస్ట్రీలో కొత్త టాక్ వినిపిస్తుంది. ఆ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు జరిపి ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాకపోతే దీనిపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ లేదు. రామ్ చరణ్- బుచ్చిబాబు కలయికలో ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రై మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించబోతున్నట్లు సమాచారం.RC16'కి 'పెద్ది' అనే టైటిల్‌ను ఖరారు చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనుంది కాబట్టి ఈ నేమ్ అయితే కరెక్ట్‌గా సెట్ అవుతుందని అనుకుంటున్నారట. ఉత్తరాంధ్ర సైడ్ 'పెద్ది' అంటే పెద్ద అని అర్ధం. ఈ కథ అదే మోడల్‌గా ఉండటంతో దీనికి 'పెద్ది' అనే టైటిల్ ఫిక్స్ చెయ్యనున్నారని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడట. కాగా.. అందుకున్న సమాచారం ప్రకారం.. ఈ నెల 20 నుంచి 'RC16' రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>