EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan06e2cb88-2e8f-421d-8902-41612805119e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan06e2cb88-2e8f-421d-8902-41612805119e-415x250-IndiaHerald.jpgఏపీలో మారుతున్న రాజకీయ కీలక పరిణామాల్లో.. వైసీపీ ముద్రగడ పద్మనాభం చేరిక ఒకటి. ఈయన ఎపిసోడ్ ఒక కొలిక్కి రావడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు. పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. అయితు వైసీపీ అధికారంలోకి రాగానే దీనిని ఉన్నపళంగా నిలిపివేశారు. గత నాలుగన్నరేళ్లుగా ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. ఇటీవల ఎన్నికల ముందు టీడీపీ నేతలు, జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడారు. అయితే పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చి తనను ఆహ్వానిస్తారు అని ఆయన భావించారు. ఇదేమీ జరగలేదుpawan{#}Pawan Kalyan;Janasena;Episode;Cheque;TDP;Tadepalli;Mudragada Padmanabham;YCP;Letter;CMముద్రగడ నిర్ణయం.. పవన్‌ను ముంచేస్తుందా?ముద్రగడ నిర్ణయం.. పవన్‌ను ముంచేస్తుందా?pawan{#}Pawan Kalyan;Janasena;Episode;Cheque;TDP;Tadepalli;Mudragada Padmanabham;YCP;Letter;CMFri, 15 Mar 2024 09:22:32 GMTఏపీలో మారుతున్న రాజకీయ కీలక పరిణామాల్లో.. వైసీపీ ముద్రగడ పద్మనాభం చేరిక ఒకటి. ఈయన ఎపిసోడ్ ఒక కొలిక్కి రావడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు. పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. అయితు వైసీపీ అధికారంలోకి రాగానే దీనిని ఉన్నపళంగా నిలిపివేశారు. గత నాలుగన్నరేళ్లుగా ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది.



ఇటీవల ఎన్నికల ముందు టీడీపీ నేతలు, జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడారు. అయితే పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చి తనను ఆహ్వానిస్తారు అని ఆయన భావించారు. ఇదేమీ జరగలేదు. దీంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలో కాపు ఓట్లపై దృష్టి సారించిన వైసీపీ ఆయనతో సంప్రదింపులు జరిపింది. ఆయన పార్టీలో చేరేందుకు సుముఖుత వ్యక్తం చేశారు. ఈ నెల 14న వైసీపీలో చేరతానని.. దీనిపై అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ ప్రయాణంలో తనతో భాగస్వామ్యం కావాలని కోరారు.



ఇంతలోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ముందుగా అనుకుంటున్నట్లు ఈ నెల 14న వైసీపీలో చేరడం లేదని.. 15న లేదా 16న చేరతానని ప్రకటన విడుదల చేశారు. దానికి భద్రతా చర్యలను సాకుగా చెబుతున్నారు. ఈ మేరకు ఆయన అభిమానులకు ఓ లేఖ రాశారు. ముందుగా అనుకున్నట్లు తాడేపల్లి వెళ్లే ర్యాలీ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కేవలం తాను ఒక్కడిని మాత్రమే తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటానని వివరించారు.



తాను ఊహించిన దానికన్నా..
భారీ స్థాయిలో స్పందన రావడంతో.. సీఎం క్యాంపు కార్యాలయంలో సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. కూర్చోడానికే కాదు.. కనీసం నిల్చొవడానికి కూడా స్థలం సరిపోదని.. ప్రతి ఒక్కరిన చెక్ చేసి పంపించడం ఇబ్బంది అని చెప్పడంతోనే ర్యాలీ వాయిదా వేసుకుంటున్నట్లు.. మిమ్మల్ని నిరుత్సాహ పరిచినందుకు క్షమాపణ లు కోరారు. అయితే ముద్రగడ పిలుపుకు ఆశించిన స్పందన రాలేదని.. వచ్చిన వారికి ఖర్చులన్నీ మీరే భరించాలని సీఎం క్యాంపు కార్యాలయం తెలిపిందంట. అందుకే ఆయన ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>