MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ తీరు విభిన్నం. ఎటువంటి ఫిలిమ్ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ అదేవిధంగా గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయంగ్ హీరో మొదటి నుండి తన టాలెంట్ ను నమ్ముకున్నాడు. తన టాలెంట్ పై అతడికి ఉన్న మితిమీరిన విశ్వాసంతో తన సినిమాల ప్రమోషన్ ఫంక్షన్స్ లో ఏదోఒక వివాదాస్పద కామెంట్స్ చేయడం అతడికి అలవాటుగా మారింది. ఈ వివాదాస్పద కామెంట్స్ వల్ల అతడి పేరు చాలామందికి తెలిసి వచ్చేలా అయింది. అయితే గతంలో ఈ యంగ్ హీరో చేసిన వివాదాస్పద కామెంట్స్ వల్ల అతడికి యాటిట్యూడ్ ఎక్కువ అంటూ నvishek sen{#}Athadu;God Father;Tirupati;Viswak sen;Industry;Yevaru;Hero;Telugu;media;Cinemaరూట్ మార్చిన విశ్వక్ సేన్ !రూట్ మార్చిన విశ్వక్ సేన్ !vishek sen{#}Athadu;God Father;Tirupati;Viswak sen;Industry;Yevaru;Hero;Telugu;media;CinemaFri, 15 Mar 2024 15:00:00 GMTటాలీవుడ్ యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ తీరు విభిన్నం. ఎటువంటి ఫిలిమ్ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ అదేవిధంగా గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయంగ్ హీరో మొదటి నుండి తన టాలెంట్ ను నమ్ముకున్నాడు. తన టాలెంట్ పై అతడికి ఉన్న మితిమీరిన విశ్వాసంతో తన సినిమాల ప్రమోషన్ ఫంక్షన్స్ లో ఏదోఒక వివాదాస్పద కామెంట్స్ చేయడం అతడికి అలవాటుగా మారింది.



ఈ వివాదాస్పద కామెంట్స్ వల్ల అతడి పేరు చాలామందికి తెలిసి వచ్చేలా అయింది. అయితే గతంలో ఈ యంగ్ హీరో చేసిన వివాదాస్పద కామెంట్స్ వల్ల అతడికి యాటిట్యూడ్ ఎక్కువ అంటూ నెగిటివ్ ప్రచారం జరగడమే కాకుండా ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులకు అతడు దూరం అయ్యాడు అన్న కామెంట్స్ కూడ వచ్చాయి.  



గతంలో అతడు నటించిన ఒక సినిమా ప్రమోషన్ ఫంక్షన్ లో మాట్లాడుతూ ‘న‌న్నెవ‌రూ లేపాల్సిన ప‌ని లేదు’ అంటూ చేసిన కామెంట్ వైర‌ల్ అవ్వడమే కాకుండా మళ్ళీ అతడి యాటిట్యూడ్ పై చర్చలు జరిగేలా ఆస్కారం కలిగించింది. కానీ ఈమధ్య కాలంలో అతడి సినిమాలు వరసపెట్టి అంచనాలు అందుకోవడంలో వెనకపడుతున్న నేపధ్యంలో అతడి తీరులో మార్పు వచ్చినట్లు కొందరికి అనిపిస్తోంది.



లేటెస్ట్ గా విడుదలైన ‘గామి’ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఈమధ్య తిరుపతి వెళ్ళి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత అక్కడ తనను కలిసిన మీడియా వారితో చేసిన కామెంట్స్ విన్నవారికి విశ్వక్ సేన్ తీరులో మార్పు వచ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘గామి’ లాంటి మంచి ప్ర‌య‌త్నానికి అంద‌రూ స‌పోర్ట్ చేయాల‌ని తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఈ సినిమా గురించి మాట్లాడి ప్ర‌మోట్ చేయాల‌ని కోరాడు. దీనితో ఈకామెంట్ ప‌ట్టుకుని కొంద‌రు మీమ్స్ వ‌దులుతు సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఈ యంగ్ హీరో తనను ఎవరు లేపవలసిన పనిలేదు అంటూ మితిమీరిన ఆత్మ విశ్వాసం ప్రదర్శించిన ఈ యంగ్ హీరో వరసపెట్టి దెబ్బలు తగలడంతో ఈ యంగ్ హీరో మారిపోయాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>