MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mamitha-baiju-maniyaa-becomes-hot-topic72e0ed01-dc6f-4602-8d24-f459def22e8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mamitha-baiju-maniyaa-becomes-hot-topic72e0ed01-dc6f-4602-8d24-f459def22e8e-415x250-IndiaHerald.jpg ‘ప్రేమలు’ మూవీ హీరోయిన్ మమిత బైజు మ్యానియా ఒక్కసారిగా టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీని అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలోని యూత్ ని షేక్ చేస్తోంది. మళయాళ బ్యూటీస్ సాయి పల్లవి అనుపమా పరమేశ్వరన్ లాంటి క్రేజీ హీరోయిన్స్ కు ఇప్పటికే టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఆతరువాత మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీ నుండి కొంతమంది హీరోయిన్స్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి నిలబడాలని ప్రయత్నించినప్పటికీ ఆప్రయత్నాలు ఏమాత్రం వారికి కలిసిరాలేదు. ఈ పరిస్థితుల మధ్య లేటెస్ట్ గా విడుదలైన ‘ప్రేమలు’ తెలుగు రాష్ట్రాలలోని యవత కు RAJAMOULI{#}Love Story;Crush;Rajamouli;Father;Hyderabad;Sai Pallavi;Tollywood;Industry;Telugu;Heroine;Cinemaమమిత బైజు మ్యానియాలో టాలీవుడ్ ఇండస్ట్రీ !మమిత బైజు మ్యానియాలో టాలీవుడ్ ఇండస్ట్రీ !RAJAMOULI{#}Love Story;Crush;Rajamouli;Father;Hyderabad;Sai Pallavi;Tollywood;Industry;Telugu;Heroine;CinemaFri, 15 Mar 2024 16:00:00 GMT
‘ప్రేమలు’ మూవీ హీరోయిన్ మమిత బైజు మ్యానియా ఒక్కసారిగా టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీని అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలోని యూత్ ని షేక్ చేస్తోంది. మళయాళ బ్యూటీస్ సాయి పల్లవి అనుపమా పరమేశ్వరన్ లాంటి క్రేజీ హీరోయిన్స్ కు ఇప్పటికే టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఆతరువాత మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీ నుండి కొంతమంది హీరోయిన్స్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి నిలబడాలని ప్రయత్నించినప్పటికీ ఆప్రయత్నాలు ఏమాత్రం వారికి కలిసిరాలేదు.



ఈ పరిస్థితుల మధ్య లేటెస్ట్ గా విడుదలైన ‘ప్రేమలు’ తెలుగు రాష్ట్రాలలోని యవత కు బాగా నచ్చడంతో ఆమె మ్యానియా ఒక్కసారిగా ఊపు అందుకుంది. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ మూవీలో నటించిన మమిత కు రాజమౌళి మహేష్ ల ప్రశంసలు లభించడంతో ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది.



అంతేకాదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోని యూత్ కు ఆమె కొత్త క్రష్ అంటూ ఆమెకు మరింత ప్రచారం జరుగుతోంది. 7 సంవత్సరాల క్రితం 2017లో ‘సర్వోపారి పలక్కారన్’ మూవీతో ఆమె మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తండ్రి బైజు కృష్ణన్ వైద్యుడు 2021లో ‘ఆపరేషన్ జావా’ మూవీతో ఈమెకు కెరియర్ లో బ్రేక్ వచ్చింది. ఆతరువాత ‘సూపర్ శరణ్య’ మూవీతో ఆమెలోని నటి బయటకు వచ్చింది.



ఆతరువాత ‘ప్రణయ విలాసం’ మూవీలో ఆమె నటనకు ప్రశంసలతో పాటు అవార్డులు కూడ వచ్చాయి. ఈపరిస్థితుల మధ్య ఊహించని విధంగా ప్రేమలు హిట్ అవ్వడంతో ఆమె మ్యానియా తెలుగు ఫిలిమ్ ఫిలిమ్ ఇండస్ట్రిలో ఒక్కసారిగా పెరిగింది. ఇటీవల ఆమె ఈసినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చి ఒక థియేటర్లో తన సినిమాను చూస్తునప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుందట’ ఈసినిమా ఈ రేంజ్ లో హిట్ అవ్వడంతో టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రికి చెందిన అనేకమంది దర్శక నిర్మాతలు ఈమెతో తమ సినిమాలకు సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్..  






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>