Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoofc85511a7-56a9-425b-941a-bd48935cadc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoofc85511a7-56a9-425b-941a-bd48935cadc6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ప్రేక్షకులందరికీ కూడా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడంటే వరుస ఫ్లాపులు రావడంతో ఎక్కడ పెద్దగా పూరి పేరు వినిపించడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం ఈ పూరి పేరు వింటేనే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యేది. ఇక పూరి సినిమా వస్తుంది అంటే చాలు ఇండస్ట్రీ రికార్డులు బద్దలవుతాయి అని అందరూ నమ్మేవారు. అంతలా హవా నడిపించాడు పూరి జగన్నాథ్. ఏకంగా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరికి కూడా ఒకప్పుడు సాలిడ్ హిట్లు ఇచ్చింది పూరి జగన్నాథ్ అని చెప్పాలి. ఇప్పటి స్టార్ హీరోలకు ఒకప్పుTollywoof{#}puri jagannadh;Industry;Success;Tammudu;Mass;Annayya;Thammudu;Prasthanam;District;shankar;Director;Cinema;MLA;YCPడైరెక్టర్ పూరికి రెండో తమ్ముడు ఉన్నాడా.. ఇప్పుడు ఎమ్మెల్యేనట తెలుసా?డైరెక్టర్ పూరికి రెండో తమ్ముడు ఉన్నాడా.. ఇప్పుడు ఎమ్మెల్యేనట తెలుసా?Tollywoof{#}puri jagannadh;Industry;Success;Tammudu;Mass;Annayya;Thammudu;Prasthanam;District;shankar;Director;Cinema;MLA;YCPFri, 15 Mar 2024 10:40:00 GMTటాలీవుడ్ సినీ ప్రేక్షకులందరికీ కూడా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడంటే వరుస ఫ్లాపులు రావడంతో ఎక్కడ పెద్దగా పూరి పేరు వినిపించడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం ఈ పూరి పేరు వింటేనే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యేది. ఇక పూరి సినిమా వస్తుంది అంటే చాలు ఇండస్ట్రీ రికార్డులు బద్దలవుతాయి అని అందరూ నమ్మేవారు. అంతలా హవా నడిపించాడు పూరి జగన్నాథ్. ఏకంగా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరికి కూడా ఒకప్పుడు సాలిడ్ హిట్లు ఇచ్చింది పూరి జగన్నాథ్ అని చెప్పాలి. ఇప్పటి స్టార్ హీరోలకు ఒకప్పుడు మాస్ ఫాలోయింగ్ రావడానికి కారణం కూడా పూరి సినిమాలే.



 అంతలా పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్లు తీశాడు. అయితే పూరి జగన్నాథ్ గురించి చెప్పమంటే అందరూ ఆయన కెరీర్ గురించి చెప్పేస్తుంటారు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పూరి జగన్నాథ్ కి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఇన్నాళ్లు ఒకే తమ్ముడు సాయిరాం శంకర్ ఉన్నాడు అని కొంతమందికి తెలుసు. కానీ పూరి జగన్నాథ్ కి మరో సొంత తమ్ముడు కూడా ఉన్నాడట. ఇది  సినిమా ఇండస్ట్రీలోని కొద్ది మందికి మాత్రమే తెలుసట. పూరి రెండో తమ్ముడు ఏం చేస్తుంటాడు ఇండస్ట్రీలో ఏ విభాగం లో ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు కదా. అయితే పూరి రెండో తమ్ముడు అటు ఇండస్ట్రీకి సంబంధం లేని ప్రొఫెషన్ లో ఉన్నాడట.


 పూరి జగన్నాథ్ రెండో తమ్ముడి పేరూ ఉమాశంకర్ గణేష్. ప్రస్తుతం ఉమా శంకర్ వైజాగ్ జిల్లా నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు  ఆయన ఒక మంచి నాయకుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు అని చెప్పాలి. 20 ఏళ్ళ వయసులోనే సర్పంచ్ గా గెలిచారు. అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. ఈయన సక్సెస్ వెనక అన్నయ్య పూరి జగన్నాథ్ ప్రోత్సాహం సలహాలు సూచనలు కూడా ఉన్నాయట. అయితే ఈ విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి మరో తమ్ముడు సాయిరాం శంకర్ అభిమానులతో పంచుకున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>