DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jagan6f988bda-1785-4bf1-9a0f-bb07492ed168-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jagan6f988bda-1785-4bf1-9a0f-bb07492ed168-415x250-IndiaHerald.jpgజగన్ కి అత్యంత ఇష్టమైన మంత్రి ఎవరు అంటే గుడివాడ అమర్ నాథ్ పేరు చెబుతారు. జగన్ ఆయన్ను 2014 నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సీనియర్లు ఎంతో మంది ఆనాడు జిల్లాలో ఉన్నా కూడా సుదీర్ఘకాలం పాలు వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గా గుడివాడను జగన్ కొనసాగించారు. ఆ తర్వాత ఆయనకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఓడిపోతే 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. మాట ఇచ్చి మరీ మంత్రిని చేశారు. కానీ ఇటీవల విడుదల చేసిన జాబితాలో ఆయన్ను అనకాపల్లి జాబితా నుంచి తొలగించారు. నియోజకవర్గాల ప్రక్షాళనలో భాగంగాjagan{#}amar;bharath;Amarnath Cave Temple;Jagan;Sri Bharath;Anakapalle;Vishakapatnam;Gajuwaka;MLA;Party;Minister;Janasena;CM;YCPఅమర్నాథ్‌కు జగన్‌ న్యాయం చేస్తారా?అమర్నాథ్‌కు జగన్‌ న్యాయం చేస్తారా?jagan{#}amar;bharath;Amarnath Cave Temple;Jagan;Sri Bharath;Anakapalle;Vishakapatnam;Gajuwaka;MLA;Party;Minister;Janasena;CM;YCPFri, 15 Mar 2024 10:06:00 GMTజగన్ కి అత్యంత ఇష్టమైన మంత్రి ఎవరు అంటే గుడివాడ అమర్ నాథ్ పేరు చెబుతారు. జగన్ ఆయన్ను 2014 నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సీనియర్లు ఎంతో మంది ఆనాడు జిల్లాలో ఉన్నా కూడా సుదీర్ఘకాలం పాలు వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గా గుడివాడను  జగన్ కొనసాగించారు.  ఆ తర్వాత ఆయనకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు.


ఓడిపోతే 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. మాట ఇచ్చి మరీ మంత్రిని చేశారు. కానీ ఇటీవల విడుదల చేసిన జాబితాలో ఆయన్ను అనకాపల్లి జాబితా నుంచి తొలగించారు. నియోజకవర్గాల ప్రక్షాళనలో భాగంగా ఆ స్థానాన్ని భరత్ కు కేటాయిస్తూ సీఎం  జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనే దానిపై రకరకాల వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. జగన్ కి ఇష్టమైన మంత్రికి ఈ సారి టికెట్ లేదని టీడీపీ, జనసేన నేతలు ట్రోల్ కూడా చేశారు.


కానీ ఆయన మాత్రం జగన్ పై నమ్మకం పెట్టుకున్నారు. అందుకే సైలెంట్ గా ఉన్నారు. పార్టీ టికెట్ కేటాయించకపోతే అసమ్మతి రాగం వినిపించకుండా జగన్ మాటకు కట్టుబడి ఉన్నారు. తనకు సీటు ఇవ్వకపోయినా బాధపడనని.. వైసీపీని మాత్రం వీడిపోనని స్పష్టం చేశారు.  దీంతో ఆయన సేవలను మరో సారి ఉపయోగించుకోవాలని జగన్ భావించి గాజువాక టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


ఇటీవల అనకాపల్లి సభలో సీఎం జగన్ పాల్గొన్న సందర్భంగా గుడివాడ అమర్నాథ్ తనకున్న ఇబ్బందులను సీఎం ముందు వెల్లడిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చాలా మంది తనను అడుగుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అదే సభలో అమర్ కు సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి అమర్ నాథ్ ను తన గుండెల్లో పెట్టి చూసుకుంటా అని సీఎం భరోసా ఇచ్చారు. తాజాగా పవన్ గతంలో పోటీ చేసి ఓడిపోయిన గాజువాక ఇన్ఛార్జిగా నియమించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>