Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/pelli5b9fa00f-7fb2-4efe-8b1c-ea69a1717386-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/pelli5b9fa00f-7fb2-4efe-8b1c-ea69a1717386-415x250-IndiaHerald.jpgపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి విషయంలో అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. తమకు నచ్చిన భాగస్వామి జీవితంలోకి వస్తుందని.. ఇక జీవితాంతం సంతోషంగా ఉంటామని ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రం పెళ్లి విషయంలోనే ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది ఏకంగా పెళ్లి అని పవిత్రమైన బంధాన్ని కమర్షియల్ ఎలిమెంట్ గా వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఒక కేటుగాడు ఇలాంటిదే చేయబోయి చివరికి దొPelli{#}kushi;Kushi;Traffic police;police;Smart phone;vedhika;Girl;aryan;marriageపెళ్లిలో ఊడిపోయిన వరుడి విగ్గు.. చివరికి?పెళ్లిలో ఊడిపోయిన వరుడి విగ్గు.. చివరికి?Pelli{#}kushi;Kushi;Traffic police;police;Smart phone;vedhika;Girl;aryan;marriageFri, 15 Mar 2024 19:15:00 GMTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి విషయంలో అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. తమకు నచ్చిన భాగస్వామి జీవితంలోకి వస్తుందని.. ఇక జీవితాంతం సంతోషంగా ఉంటామని ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రం పెళ్లి విషయంలోనే ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది ఏకంగా పెళ్లి అని పవిత్రమైన బంధాన్ని కమర్షియల్ ఎలిమెంట్ గా వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక్కడ ఒక కేటుగాడు ఇలాంటిదే చేయబోయి చివరికి దొరికిపోయాడు.  ఉత్తరప్రదేశ్లోని ఖుషి నగర్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా బట్టతలను దాచేందుకు విగ్గు పెట్టుకుని మేనేజ్ చేసిన వరుడు.. చివరికి దొరికిపోయాడు. తబ్రేజ్ ఆలం అనే వ్యక్తి తన పేరును  ఆర్యన్ ప్రసాద్ గా మార్చుకుని.. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు ఒక మహిళకు అబద్ధం చెప్పాడు. ఇక మాయమాటలు చెప్పి ఆ మహిళతో సంవత్సరం పాటు రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఇక ఈ జంట వివాహం చేసుకోవాలని ప్రతిపాదనకు మహిళ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు.


 ఇకపోతే ఇటీవలే పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. అప్పటికే తబ్రేజ్ అబద్ధాలు అన్ని బట్టబయలు అయ్యాయి. వధువు కుటుంబ సభ్యులు పెళ్లి కోసం అన్ని సిద్ధం చేశారు. ఇక పెళ్లి తంతు  మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది అని అనుకుంటున్నా సమయంలో తబ్రేజ్  నుంచి ఫోన్ వచ్చింది. తన తల్లికి గుండెపోటు వచ్చిందని పెళ్లికి తమ కుటుంబ సభ్యులు ఊరేగింపుగా వచ్చే అవకాశం లేదని మహిళ కుటుంబీకులకు చెప్పాడు. ఆ తర్వాత తబ్రేజ్ అలంకరించిన కారులో వివాహ వేదిక వద్దకు వచ్చాడు. అయితే నగలు విషయంలో ఒక వివాదం మొదలవగా.. అంతలోనే తబ్రేజ్ తలపై ఉన్న విగ్ ఊడిపోయింది. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. వెంటనే అతని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించడంతో పోలీసులు అసలు నిజాన్ని తేల్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>