MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/razakar427b12d0-4b79-427a-853b-24f27e70becb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/razakar427b12d0-4b79-427a-853b-24f27e70becb-415x250-IndiaHerald.jpgమనం ఎప్పుడూ కూడా చరిత్రని మర్చిపోకూడదు. ఇది ప్రతి పౌరుడి కనీస బాధ్యత. ఇక అదే కోవలో వచ్చిన తాజా మూవీ రజాకార్. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకుంది ఈ సినిమా. గూడూర్ నారాయణ రెడ్డి నిర్మాణంలో యాట సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పాపం హైదరాబాద్ ప్రజలకు మాత్రం మాత్రం చాలా కాలం స్వతంత్య్రం లభించలేదు. దానికి కారణం అప్పట్లో అక్కడి తురక పరిపాలన. అక్కడి మెజారిటీ ప్రజలు ఇండియాలో కలవాలని ఉన్నా.. హైదరాబాద్ సంస్థానాన్నిRazakar{#}Aly Khan;anasuya bharadwaj;indraja;Bharateeyudu;Raj Arjun;Anasuya;Army;Manam;Sardar Vallabhai Patel;vikram;king;Reddy;Telangana;Bobby;Hyderabad;Episode;Darsakudu;Director;Pakistan;Cinemaరజాకార్ రివ్యూ: KGF2, విక్రమ్ దీని ముందు ఎందుకు పనికిరావు?రజాకార్ రివ్యూ: KGF2, విక్రమ్ దీని ముందు ఎందుకు పనికిరావు?Razakar{#}Aly Khan;anasuya bharadwaj;indraja;Bharateeyudu;Raj Arjun;Anasuya;Army;Manam;Sardar Vallabhai Patel;vikram;king;Reddy;Telangana;Bobby;Hyderabad;Episode;Darsakudu;Director;Pakistan;CinemaFri, 15 Mar 2024 17:43:58 GMTమనం ఎప్పుడూ కూడా చరిత్రని మర్చిపోకూడదు. ఇది ప్రతి పౌరుడి కనీస బాధ్యత. ఇక అదే కోవలో వచ్చిన తాజా మూవీ రజాకార్. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకుంది ఈ సినిమా. గూడూర్ నారాయణ రెడ్డి నిర్మాణంలో యాట సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పాపం హైదరాబాద్ ప్రజలకు మాత్రం మాత్రం చాలా కాలం స్వతంత్య్రం లభించలేదు. దానికి కారణం అప్పట్లో అక్కడి తురక పరిపాలన. అక్కడి మెజారిటీ ప్రజలు ఇండియాలో కలవాలని ఉన్నా.. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న తురక రాజు అప్పటి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మాత్రం హైదరాబాద్ ని ఒక స్వతంత్ర దేశంగా ఉంచాలనుకున్నాడు. తరువాత పాకిస్తాన్ దేశంలో కలపాలని కుట్ర పన్నాడు.ఆ సమయంలో ఈ రజాకార్ అనే తురక ఉగ్రవాదులతో చేతులు కలిపి అప్పటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అమాయకపు ప్రజలని దారుణాతి దారుణంగా చంపిన సంఘటనలు ఈ సినిమాలో చర్చించారు.


సినిమా కథ విషయానికి వస్తే..1947లో బ్రిటిష్ వాళ్లు వెళుతు వెళతూ.. దేశాన్ని ఇండియా, పాకిస్థాన్ అంటూ రెండు దేశాలుగా విభజించి  స్వాతంత్య్రం ఇచ్చి వెళ్లారు. అప్పటికే దేశంలో 500పైగా స్వతంత్ర్య సంస్థనాలు ఉన్నాయి. ఇక దేశానికి మొదటి హోంమంత్రిగా పనిచేసిన సర్ధార్ వల్లభబాయ్ పటేల్ గారు దేశంలోని 500 పైగా సంస్థానాధీశులతో మాట్లాడి మన దేశంలో విలీనమయ్యేలా చేసారు. అయితే అందులో కశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్  మాత్రం మన దేశంలో విలీనం కాకుండా మొండికేసాయి. నిజాం ఆఫ్ హైదరాబాద్  మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నియంత్రణలో అతిపెద్ద రాచరిక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా మిగిలిపోయింది. ఆ సమయంలో మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MIM) ఏర్పాటు చేసిన రజాకార్స్ అనే పారామిలిటరీ ఆర్మీ ఫోర్స్ కంట్రోల్‌లో ఈ ప్రాంతం ఉంటుంది. ఇండైరెక్ట్ గా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ని కూడా వీరే కంట్రోల్ చేసేవారు.వారు తమ దురాగతాలతో హిందువులలో భయాందోళనలను రేకెత్తించారు. వారు చేసిన దారుణాతి దారుణమైన పనులకు సామాన్యలు ఎలా తిరగబడ్డారు.. అనేది ఈ రజాకార్ చిత్రం.


సినిమాను మాత్రం దర్శకుడు ఒక రేంజ్ లో తెరకెక్కించాడు. నిజాం హయాంలో జరిగిన మారణహోమం గురించి.. దానికి తగ్గ సన్నివేశాలను అల్లుకుని ఆకట్టుకొనే విధంగా సినిమాని ఎంతో అద్భుతంగా తీసి మెప్పించాడు. చెప్పాలంటే చాలా ఆకట్టుకొనే సన్నివేశాలు ఇంకా కన్నీరు తెప్పించే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమా చూసిన ప్రేక్షకుడు ఖచ్చితంగా బరువెక్కిన హృదయంతో బయటకు వస్తాడు.వీటికి తోడు నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ను కలిపేసేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ పోలో అనే ఎపిసోడ్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలాంటి పాత్ర పోషించారనేది కూడా చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో ప్రధానంగా నిజాం, రజాకార్లు.. సామాన్యులపై చేసిన దౌర్జన్యాలను  హైలైట్ చూపించారు. ఈ సినిమా కోసం భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. బతుకమ్మ పాట మూవీలో హైలెట్‌గా నిలిచింది. వీఎఫ్‌ఎక్స్ తో పాటు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.


సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ముందు KGF2, విక్రమ్ లాంటి సినిమాలు ఎందుకు పనికిరావు. ప్రతి తెలంగాణ బిడ్డ మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.నటినటుల విషయానికి వస్తే.. బాబీ సింహాతో పాటు రాజ్ అర్జున్ రజాకార్‌గా సూపర్ అనిపించాడు. ఖాసిం రజ్వీ తన పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇక హైదరాబాద్ నిజాం పాత్రలో మార్ఖండ్ దేశ్‌పాండే కూడా చాలా బాగా నటించాడు. తేజ్ సప్రూ  ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు.ఇక ఇంద్రజ అయితే తన అనుభవాన్ని ఉపయోగించి ప్రాణం పోసింది. అనసూయ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు. అనసూయని కాక వేరే నటిని తీసుకుంటే ఆ పాత్రకి న్యాయం జరిగేది. మిగిలిన వారు తమ పరిధి మేరకు ఆకట్టుకునే నటనను కనబరిచారు. ఈ సినిమాకి నిశ్శందేహంగా 4.5/5 రేటింగ్ ఇవ్వొచ్చు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>