Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0e09ccad-f658-4426-8615-e6d897b116ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0e09ccad-f658-4426-8615-e6d897b116ba-415x250-IndiaHerald.jpgపెరగడం, విరగడం ఈ రెండూ చిత్ర పరిశ్రమలో సహజం. ఉన్నత స్థాయికి ఎదగడం, పాతాళంలోకి తొక్కివేయడం అనేవి చాలా జరుగుతుంటాయి. అలా నటిగా తొలి చిత్రంతో వెలిగిపోయిన హీరోయిన్‌ కిరణ్‌ రాథోడ్‌ గుర్తుందా.ఆమె ఇప్పుడు జీవితంలో చాలా కోల్పోయి మళ్లీ నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. జెమిని చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన నటి కిరణ్‌. ఆ చిత్రం విజయంతో ఈమె పేరు మారుమ్రోగింది. అవకాశాలు వరుస కట్టాయి. అలా కమలహాసన్‌, అజిత్‌, విజయకాంత్‌, ప్రశాంత్‌ వంటి స్టార్‌ హీరోలతో జత కట్టారు. ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు.చాలా కాలం తరువాత కsocialstars lifestyle{#}Gemini;Athadu;television;India;marriage;Chitram;Telugu;Cinemaప్రియుడి మాట విని తప్పుచేసిన బిగ్ బాస్ బ్యూటీ..!!ప్రియుడి మాట విని తప్పుచేసిన బిగ్ బాస్ బ్యూటీ..!!socialstars lifestyle{#}Gemini;Athadu;television;India;marriage;Chitram;Telugu;CinemaThu, 14 Mar 2024 14:30:00 GMTపెరగడం, విరగడం ఈ రెండూ చిత్ర పరిశ్రమలో సహజం. ఉన్నత స్థాయికి ఎదగడం, పాతాళంలోకి తొక్కివేయడం అనేవి చాలా జరుగుతుంటాయి. అలా నటిగా తొలి చిత్రంతో వెలిగిపోయిన హీరోయిన్‌ కిరణ్‌ రాథోడ్‌ గుర్తుందా.ఆమె ఇప్పుడు జీవితంలో చాలా కోల్పోయి మళ్లీ నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. జెమిని చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన నటి కిరణ్‌. ఆ చిత్రం విజయంతో ఈమె పేరు మారుమ్రోగింది. అవకాశాలు వరుస కట్టాయి. అలా కమలహాసన్‌, అజిత్‌, విజయకాంత్‌, ప్రశాంత్‌ వంటి స్టార్‌ హీరోలతో జత కట్టారు. ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు.చాలా కాలం తరువాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఒకటి రెండు చిత్రాల్లో నటించారు. ఐటమ్‌ సాంగ్స్‌లోనూ నటించారు. ఈమె గురించి చాలా వదంతులు దొర్లాయి. కాగా ఇటీవల ఒక టీవీ చానల్‌లో పాల్గొన్న కిరణ్‌ తన నట జీవితం, వ్యక్తిగతం గురించి తెలుపుతూ కథానాయకిగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తన ప్రియుడు చెప్పిన మాటలు విని సినిమాలకు దూరం అయ్యానని చెప్పారు. అయితే అదే తాను చెసిన పెద్ద తప్పు అని ఆ తరువాత తెలుసుకున్నానన్నారు. దీంతో మళ్లీ నటించడానికి సిద్ధం కాగా కొందరు తనను తప్పుగా వాడుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అడ్జెస్ట్‌మెంట్‌ కావాలని అన్నారని బహిరంగంగానే చెప్పారు.

అలాంటి సమయంలో తన ప్రేమికుడు వదిలేశాడని చెప్పారు. అందుకు కారణం తమ మధ్య చిన్న సమస్యలేనని చెప్పారు. ఒకసారి అతను తనను కొట్టారని, దాన్ని తాను సహించలేకపోయానని తెలిపారు. ఆ తరువాత అతనికి ఫోన్‌ చేసి రమ్మని పిలిచి కోపంతో కసి తీరా గట్టిగా కొట్టానని చెప్పారు. అప్పుడు అతడు చిరిగిన బట్టలతో రోడ్డున పడ్డాడని చెప్పారు. ఈ కారణంగానో ఏమో కొందరు తనను తప్పుగా ఉపయోగించుకోవాలని చూశారని, మరి కొందరు రాత్రి వేళల్లో ఫోన్‌ చేసేవాళ్లని చెప్పారు. వారంతా తప్పుడు వాళ్లని తాను అర్థం చేసుకున్నానన్నారు. తనకు మంచి స్నేహితులు లేరని కిరణ్‌ చెప్పారు.ఇలాంటి పలు కారణాల వల్ల తాను సినిమా అవకాశాలను కోల్పోయానని చెప్పారు. అలాగే తనకు పెళ్లి అయ్యిందని, పిల్లలు పుట్టారని పుకార్లు పుట్టించారని, తాను పెళ్లే చేసుకోలేదని స్పష్టం చేశారు. తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 7లో ఆమె కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్‌ ఇండియా నుంచి పలు సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చాన్సుల కోసం ఆమె ఎదురు చూస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>