PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-20248ce3f7dc-70d8-46cf-8b79-28409c0f367f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-20248ce3f7dc-70d8-46cf-8b79-28409c0f367f-415x250-IndiaHerald.jpgవైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది.ఒంగోలు ఎంపి మాగుంట తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఎంపి మాగుంట తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలిసి వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. అప్పట్లో కాంగ్రెస్‌ ఎంపిగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసిపి టికెట్‌పై పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.దీంతో విధిలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి బిజెపి-టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా ఒంగAP Elections 2024{#}రాజీనామా;Telugu Desam Party;YCP;Hanu Raghavapudi;TDP;CBN;MLA;local language;Minister;February;Assembly;MP;Partyవైసీపీకి మరో గట్టి షాక్.. ఆ ఎంపీ రాజీనామా?వైసీపీకి మరో గట్టి షాక్.. ఆ ఎంపీ రాజీనామా?AP Elections 2024{#}రాజీనామా;Telugu Desam Party;YCP;Hanu Raghavapudi;TDP;CBN;MLA;local language;Minister;February;Assembly;MP;PartyThu, 14 Mar 2024 14:40:01 GMTవైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది.ఒంగోలు ఎంపి మాగుంట తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఎంపి మాగుంట తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలిసి వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. అప్పట్లో కాంగ్రెస్‌ ఎంపిగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసిపి టికెట్‌పై పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.దీంతో విధిలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి బిజెపి-టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా ఒంగోలు పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి కేవలం 15 వేల ఓట్ల తేడాతో మాగుంట ఓడిపోయారు. అయితే 2014 ఎన్నికల్లో టిడిపి ఎపిలో అధికారంలోకి రావడంతో మాగుంటను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీకి దించడంతో ఆయన గెలుపొందారు. ఆ సమయంలో మాగుంటకు మంత్రి పదవి ఇస్తారని ఆశించారు. అయితే చంద్రబాబు మాగుంటకు మంత్రి పదవి ఇవ్వలేదు.


అనంతరం 2019 ఎన్నికల్లో మాగుంట తిరిగి వైసిపిలో చేరి ఒంగోలు పార్లమెంట్‌ నుంచి వైసిపి టికెట్‌పై పోటీ చేసి 2.14 లక్షల భారీ మెజార్టీతో గెలిచారు.తిరిగి 2024 వ సంవత్సరంలో కూడా మాగుంట వైసిపి టికెట్‌పై పోటీ చేసేందుకు చివరి దాకా పోరాడారు. అయితే ఆయనకు వైసిపి అధినేత, సియం వైయస్‌ జగన్‌ ఈసారి ఎంపి టికెట్‌ ఇచ్చేందుకు అస్సలు ఒప్పుకోలేదు. మాగుంట కాంబినేషన్‌ అయితే ఒంగోలుతో పాటు మరో రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్దులు గెలుపొందే అవకాశాలు ఉన్నాయని భావించిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి మాగుంట కోసం చివరి వరకు పార్టీ అధిష్టానంతో పోరాడారు… అయితే బాలినేని ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈసారి మాగుంట తనదారి తాను చూసుకున్నారు… ఫిబ్రవరి 28వ తేదిన మాగుంట పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు… అప్పటికే టిడిపి అధినేత చంద్రబాబుతో టచ్లో ఉన్న మాగుంటకు ఈనెల 16వ తేదిన పార్టీలో చేరేందుకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు…



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>