ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/morning-school-ap-sarkar4b6b6f6c-1f41-4e83-9713-f46579566043-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/morning-school-ap-sarkar4b6b6f6c-1f41-4e83-9713-f46579566043-415x250-IndiaHerald.jpgమార్చి ఆరంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి వేస్తుండడంతో అటు పిల్లలను పెద్దలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో పిల్లలు ఒంటి పూట బడులు ఎప్పుడెప్పుడు మొదలవుతాయో అంటూ ఎదురుచూస్తున్నారు.. ఈ క్రమంలోనే ఆంధ్రాలో ఈనెల 18 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా మార్చి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ ఒంటి పూటబడులు ఈ ఏడాది కాస్త ఆలస్యం అవుతుంది. అయితే ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఇంకా తెలియజేయలేదు.. ఒంటిపూట బడుల పైన సచివాలయ ఉద్యోగాల సంఘ అధ్యక్షుడు కాకర్ల వెంకMORNING SCHOOL;AP SARKAR{#}Parents;School;Government;March;Teluguఆరోజు నుంచే ఏపీలో స్కూళ్లకు ఒంటిపూట బడులు..!!ఆరోజు నుంచే ఏపీలో స్కూళ్లకు ఒంటిపూట బడులు..!!MORNING SCHOOL;AP SARKAR{#}Parents;School;Government;March;TeluguThu, 14 Mar 2024 10:00:00 GMTమార్చి ఆరంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి వేస్తుండడంతో అటు పిల్లలను పెద్దలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో పిల్లలు ఒంటి పూట బడులు ఎప్పుడెప్పుడు మొదలవుతాయో అంటూ ఎదురుచూస్తున్నారు.. ఈ క్రమంలోనే ఆంధ్రాలో ఈనెల 18 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా మార్చి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ ఒంటి పూటబడులు ఈ ఏడాది కాస్త ఆలస్యం అవుతుంది. అయితే ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఇంకా తెలియజేయలేదు.. ఒంటిపూట బడుల పైన సచివాలయ ఉద్యోగాల సంఘ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి ఇటీవలే ఒక ప్రకటనలో తెలియజేశారు.


మార్చి 18 నుంచి ఏపీలో పదవ తరగతి మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయని ఈ పరీక్షలు జరుగుతున్న స్కూళ్లలో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మరొకవైపు వంటి పూట బడులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విద్యార్థి తల్లిదండ్రులు కూడా కాస్త అసహనాన్ని తెలియజేయడంతో పాటు పిల్లల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒంటిపూట బడులను త్వరగా ప్రారంభించాలని పలు విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి పలు రకాల పత్రాలను సమర్పించారు. మరి ఈ విషయం ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియలేదు.

మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు నిర్వహించారు.. ఉదయం 7: 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు.. ఇక ఏప్రిల్ 24వ తేదీ చివరి పని దినమని ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు.. ఏపీలో మాత్రం ఇంకా ఒంటి పూట బడిల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని తీసుకోలేదు..ఈ ఏడాది మార్చి 15 కంటే ముందుగానే ఒంటి పూట బడులను మొదలు పెట్టాలని డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ఇంకా తెలపలేదు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>