Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0f69d30e-4569-4916-9c29-b9bcb07e3882-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0f69d30e-4569-4916-9c29-b9bcb07e3882-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు మనోజ్ ఆ వార్తల చెక్ పెట్టాడు. కొద్ది రోజులు మనోజ్ అతడి భార్య మౌనికల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.గతేడాది మార్చిలో మనోజ్- భూమా మౌనికరెడ్డిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇద్దరికి ఇది రెండో పెళ్లి. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన కొద్ది నెలలకే తాను తండ్రి కాబోతున్నట్టు మనోజ్ ప్రకటించాడు. గతేడాది డిసెంబర్లో ఈ శుభవార్త పంచుకున్నాడు. ఇటీవలె మౌనిక బేబీ బంప్ ఫొటో షేర్ చేసి తండ్రి కాబోతున్నానంటూ మురిసిపోయాడు. అయsocialstars lifestyle{#}manchu manoj kumar;mounika;Bhuma Akhila Priya;you tube;Nijam;Cheque;marriage;Reddy;Cinema;Father;March;News;Wifeఎట్టకేలకు ఆ వార్తకు చెక్ పెట్టిన మంచు మనోజ్ ..!!ఎట్టకేలకు ఆ వార్తకు చెక్ పెట్టిన మంచు మనోజ్ ..!!socialstars lifestyle{#}manchu manoj kumar;mounika;Bhuma Akhila Priya;you tube;Nijam;Cheque;marriage;Reddy;Cinema;Father;March;News;WifeWed, 13 Mar 2024 16:15:00 GMTఎట్టకేలకు మనోజ్ ఆ వార్తల చెక్ పెట్టాడు. కొద్ది రోజులు మనోజ్ అతడి భార్య మౌనికల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.గతేడాది మార్చిలో మనోజ్- భూమా మౌనికరెడ్డిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇద్దరికి ఇది రెండో పెళ్లి. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన కొద్ది నెలలకే తాను తండ్రి కాబోతున్నట్టు మనోజ్ ప్రకటించాడు. గతేడాది డిసెంబర్లో ఈ శుభవార్త పంచుకున్నాడు.

ఇటీవలె మౌనిక బేబీ బంప్ ఫొటో షేర్ చేసి తండ్రి కాబోతున్నానంటూ మురిసిపోయాడు. అయితే అప్పటి నుంచి మౌనిక కవలకు జన్మనిచ్చిందంటూ పలు యూట్యూబ్ చానల్లో వార్తలు వినిపించాయి. ఇటీవల ప్రెగ్నెన్సీ అని ప్రకటించారు.. అప్పుడే పిల్లలు పుట్టడం ఏంటని అంతా ఆలోచనలో పడ్డారు. ఇది నిజమా కాదా? అని మంచు ఫ్యాన్స్ అంతా డైలామాలో ఉండిపోయారు. ఈ క్రమంలో తనకు కవలలు పుట్టారంటూ వస్తున్న వార్తలపై మనోజ్ స్పందించాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటన ఇచ్చాడు. "డియర్ వెల్ విషర్స్.. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, అప్యాయతకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మీరు ఇచ్చే సపోర్టుకు ధన్యుడిని. అయితే ప్రస్తుతం నా భార్య (భూమ మౌనిక రెడ్డి) పూర్తి ఆరోగ్యంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి. మే నెలలో మాకు పుట్టబోయే బిడ్డ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అయితే మేము ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాం. మాకు కవలలు పుట్టారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ సమయంలో వచ్చినప్పుడు మేమే నేరుగా ప్రకటన ఇస్తాం. అప్పటి వరకు ఎలాంటి రూమర్స్ వచ్చిన వాటిని పట్టించుకోకండి" అంటూ క్లారిటీ ఇచ్చాడు.అలాగే తన భార్య మౌనిక డెలివరి సమయంలో మే నెలలోని అని స్పష్టం కూడా చేశాడు మనోజ్. దీంతో ఈ దంపతులకు కవలలు జన్మించారనే వార్తలకు చెక్ పడింది.ప్రస్తుతం మనోజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనోజ్-మౌనికలకు ఇది రెండవ పెళ్లి అనే విషయం తెలిసిందే. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత గతేడాది మార్చి 3న పెళ్లయి విడాకులు అయిన మౌనికను వివాహామాడాడు.దాదాపు కొన్నేళ్లుగా మంచు మనోజ్ వెండి తెరపై కనిపించలేదు. సినిమాలు తీయలేదు. అయితే, పెళ్లయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతారనే వార్తలు వచ్చినప్పటికీ ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ, బుల్లితెరలో మాత్రం రఫ్ ఆడిస్తున్నాడు మనోజ్. 'ఉస్తాద్' ప్రోగ్రామ్కు ఆయన యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక మళ్లీ ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి ‘వాట్ ది ఫిష్’. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు ‘అహం బ్రహ్మస్మి’ అనే మరో సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత మంచు మనోజ్ మళ్లీ తెరమీద కనిపించలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>