MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu7b7deb1b-1f8a-40ea-9bac-be577c9bbd88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu7b7deb1b-1f8a-40ea-9bac-be577c9bbd88-415x250-IndiaHerald.jpgమలయాళంలో ఈ సంవత్సరం వచ్చిన అతిపెద్ద హిట్ మూవీస్ లో ఒకటి ప్రేమలు సినిమాలు. ఈ మధ్యే తెలుగులో కూడా రిలీజైన ఈ మూవీ ఇక్కడ కూడా మంచి టాక్ తో సాలిడ్ వసూళ్ళని రాబడుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా త్వరలో ఇంకా ఎక్కువ వసూళ్లు అందుకోవడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఈ సినిమా బాగా రన్ అవ్వడంతో ఓటిటి విడుదల తేదీని కూడా వాయిదా వెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట.అయితే ఈ సినిమాపై మంగళవారం (మార్చి 12) రాత్రి టాలీవుడ్ అగ్ర నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన రివ్యూ ఇచ్చారు.మహేష్ బాబుకి ఒక సినిమా నచ్చిందంటే అది పెద్Mahesh Babu{#}Naga Chaitanya;tuesday;mahesh babu;Telugu;March;Cinema;Tollywood;mediaప్రేమలుని మెచ్చిన సూపర్ స్టార్.. ఆనందంలో టీం?ప్రేమలుని మెచ్చిన సూపర్ స్టార్.. ఆనందంలో టీం?Mahesh Babu{#}Naga Chaitanya;tuesday;mahesh babu;Telugu;March;Cinema;Tollywood;mediaWed, 13 Mar 2024 18:08:58 GMTమలయాళంలో ఈ సంవత్సరం వచ్చిన అతిపెద్ద హిట్ మూవీస్ లో ఒకటి ప్రేమలు సినిమాలు. ఈ మధ్యే తెలుగులో కూడా రిలీజైన ఈ మూవీ ఇక్కడ కూడా మంచి టాక్ తో సాలిడ్ వసూళ్ళని రాబడుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా త్వరలో ఇంకా ఎక్కువ వసూళ్లు అందుకోవడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఈ సినిమా బాగా రన్ అవ్వడంతో ఓటిటి విడుదల తేదీని కూడా వాయిదా వెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట.అయితే ఈ సినిమాపై మంగళవారం (మార్చి 12) రాత్రి టాలీవుడ్ అగ్ర నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన రివ్యూ ఇచ్చారు.మహేష్ బాబుకి ఒక సినిమా నచ్చిందంటే అది పెద్దదా చిన్నదా పరభాష సినిమానా మన భాష సినిమానా అనే ఈగో లేకుండా స్పందిస్తారు.తాజాగా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా మహేష్ బాబు ఈ మూవీపై తనదైన స్టైల్ లో స్పందించాడు. "ప్రేమలు సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కార్తికేయకు కృతజ్ఞతలు. సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓ సినిమా చూస్తూ చివరిసారి నేను ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా నాకు గుర్తులేదు.


మా ఫ్యామిలీ మొత్తానికి సినిమా చాలా బాగా నచ్చింది. సినిమాలో అందరు యంగ్‌స్టర్స్ అద్భుతంగా నటించారు. టీమ్ మొత్తానికి కంగ్రాచులేషన్స్" అని మహేష్ బాబు స్పందించారు.సూపర్ స్టార్ మహేష్ బాబు రెస్పాన్స్ చూసి ప్రేమలు టీం ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు సినిమాలో నెస్లేన్ గఫూర్ ఇంకా మిమితా బైజూ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 9న మలయాళం రిలీజ్ కాగా.. ఇప్పటి దాకా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. మార్చి 8న ఈ సినిమాని తెలుగులో రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ ఇప్పటికే రూ.3కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలుగులో రోజురోజుకూ ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతున్నాయి.గతంలో నాగ చైతన్య కూడా ప్రేమలు సినిమాపై స్పందించాడు. తాజాగా రాజమౌళి, మహేష్ బాబులాంటి దిగ్గజాల ప్రశంసలతో తెలుగులో ఈ మూవీ మరింత దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>